ఘనంగా సీత్లా పండుగ
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:40 AM
సీత్లా పండుగను యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పెద్దతండాలో మంగళవారం గిరిజనులు ఘనంగా నిర్వహించారు.
తుర్కపల్లి, జూలై 8(ఆంధ్రజ్యోతి): సీత్లా పండుగను యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పెద్దతండాలో మంగళవారం గిరిజనులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గిరిజన యువతులు, మహిళలు, యువకులు సీత్లా భవానికి నైవేద్యం సమర్పించేందుకు డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేరకు తరలివెళ్లారు. సీత్లా భవానికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పెద్ద పుష్యాల కార్తె మొదటి వారంలో ఈ పండుగను నిర్వహిస్తారు. వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని, తండావాసులు ఆరోగ్యంగా ఉండాలని, పశు సంపద అభివృద్ధి చెం దాలను గిరిజనులు సీత్లా భవానికి మొ క్కుకున్నారు.