Share News

జూలూరు-పిలాయిపల్లి రోడ్డుకు మోక్షం

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:08 AM

భూదానపోచంపల్లి మండలంలోని జూలూరు గ్రామం నుంచి పిలాయిపల్లి గ్రామం వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులు ఎట్టకేలకు పూర్తి అయ్యాయి.

జూలూరు-పిలాయిపల్లి రోడ్డుకు మోక్షం
జూలూరు-పిలాయిపల్లి రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి

ఫ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

ఫ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

భూదానపోచంపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): భూదానపోచంపల్లి మండలంలోని జూలూరు గ్రామం నుంచి పిలాయిపల్లి గ్రామం వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులు ఎట్టకేలకు పూర్తి అయ్యాయి. జూలూరు నుంచి వయా అలీనగర్‌, పెద్దగూడెం గ్రామాల మీదుగా పిలాయిపల్లి వరకు గల 7 కిలోమీటర్ల మేరకు రోడ్డుపై గుంతల మయం కావడంతో వర్షాకాలంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆర్టీసీ బస్సు కూడా బందు అయ్యింది. తిరిగి అధికారుల చొరవతో బస్సును పునరుద్ధరించారు. అధ్వానంగా మారిన ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు బీఆర్‌ఎస్‌ హయాంలో అనేకమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ రోడ్డుకు రూ.1.80కోట్లు మంజూరు చేసింది. 2023లో రోడ్డు నిర్మాణ పనులకు అప్పటి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు జూలూరు నుంచి అలీనగర్‌ వరకు రోడ్డు విస్తరించేందుకు రోడ్డంతా తవ్వారు. ఎన్నికల కోడ్‌ రావడంతో పనులను అర్ధాంతరంగా వదిలేశారు. ఆ తర్వాత పలు కారణాలతో రోడ్డు పనులు ముందుకు సాగలేదు. అయితే ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడతి పనులు చేపట్టేలా ఒప్పించడంతో ఎట్టకేలకు పనులు ముందుకు సాగాయి. ఇటీవల ఈ రోడ్డు పనులు పూర్తి కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 19న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఈ రోడ్డును ప్రారంభించారు.

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే

గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంతరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా దేశముఖి - పిలాయిపల్లి రోడ్డుకు, పెద్దగూడెం గ్రామంలో గౌడ సంఘం, పిలాయిపల్లి నుండి వయా పెద్దగూడెం జూలూరు వరకు రోడ్డును ఆయన ప్రారంభించారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ శాఖల అధికారులు కాంగ్రె్‌సపార్టీ రాష్ట్ర నాయకులు తడక వెంకటేష్‌, జిల్లా నాయకులు కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూదనరెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పాక మల్లే్‌షయాదవ్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భారత లవకుమార్‌, మండల నాయకులు పక్కీరు మల్లారెడ్డి, పక్కీరు నర్సిరెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన సామ మోహనరెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు లాలయ్య, అంజిరెడ్డి, వెంకటే్‌షగౌడ్‌, రాజిరెడ్డి, దానయ్య, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణంతో సంతోషంగా ఉంది

జూలూరు నుంచి పిలాయిపల్లి వరకు వయా పెద్దగూడెం రోడ్డు గతంలో అధ్వానంగా ఉండేది. వర్షాకాలంలో గుంతల రోడ్డుతో ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు పూర్తి చేయించారు. రోడ్డు పూర్తి కావడంతో చాలా సంతోషంగా ఉంది. ఈ రహదారి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.

-పక్కీరు నర్సిరెడ్డి, పెద్దగూడెం గ్రామం

Updated Date - Nov 20 , 2025 | 12:08 AM