పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:39 AM
రసాయన ఔషధ పరిశ్రమలు, ప్రమాదకర కర్మాగారా ల్లో పకడ్బందీగా భద్రతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని పలు పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కలెక్టర్ ఎం.హనుమంతరావు
భువనగిరి (కలెక్టరేట్), ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రసాయన ఔషధ పరిశ్రమలు, ప్రమాదకర కర్మాగారా ల్లో పకడ్బందీగా భద్రతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని పలు పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రసాయన ఔషధ పరిశ్రమల్లో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాలతో ప్రాణ నష్టం జరిగిందని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్య లు చేపట్టాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ (రెవె న్యూ) వీరారెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్‌రావు, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి, అగ్నిమాపక శాఖాధికారి మధుసూధన రావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రవీందర్ అధికారులు పాల్గొన్నారు.
యూరియా కోసం ఆందోళన వద్దు
వలిగొండ: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తెలిపారు. మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా కావాల్సినంత యారియా అందుబాటులో ఉందన్నారు. ప్రభు త్వం సూచించిన ధరకంటే ఎక్కువకు విక్రయిస్తే చర్య లు తీసుకుంటామన్నారు. ఆయనవెంట తహసీల్దార్ దశరథ, ఏవో అంజనీదేవి, రైతులు ఉన్నారు.
మోత్కూరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని, బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసిన వారికి ప్రతీ సోమవారం రూ.లక్ష చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం మోత్కూరు మండలం అనాజిపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి స్వాతి, ఎంపీవో జనార్ధన్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు.
గుండాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మండలంలోని నూనెగూడెం గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో దేవేందర్ రావు, హౌసింగ్ ఏఈ కావ్య శ్రీ, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక ఉన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని మన గ్రోమోర్ ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏవో సూరజ్‌కుమార్, ఏఈవో క్రాంతి పాల్గొన్నారు.
ఒక ఫొటో.. ఎన్నింటికో సమాధానం
ఒక ఫొటో ఎన్నింటికో సమాధానం చెబుతుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ లో ఫొటోగ్రాఫర్లతో కలిసి ఆయన కేక్‌కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఫొటో వెనుక ఫొటోగ్రాఫర్ ప్రతిభ దాగి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి అరుంధతి, టీపీజీఏ జిల్లా అధ్యక్షుడు గంధమల రాజు, ఉపాధ్యక్షులు కృపానగరం ఫణీందర్, గుజ్జ నరేష్, ప్రచార కార్యదర్శి కర్రె గణేష్, దేశ్ పాండే నరసింహ,కృపానగరం అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.