ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.3,50,999
ABN , Publish Date - May 25 , 2025 | 12:17 AM
కోదాడటౌన, మే 24 (ఆంధ్రజ్యోతి): ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.3.50లక్షలు ఖర్చు చేసి సొంతం చేసుకున్నాడు

కోదాడటౌన, మే 24 (ఆంధ్రజ్యోతి): ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.3.50లక్షలు ఖర్చు చేసి సొంతం చేసుకున్నాడు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణవాసి. కోదాడ పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన చైర్మన రామినేని శ్రీనివాసరావు ఇటీవల నూతనంగా కొనుగోలు చేసిన తన టయోటా ఫార్చ్యూనర్ లెజెండ్ కారు నెంబర్ కోసం ఏకంగా రూ.3.50లక్షలు ఖర్చు చేశారు. శనివారం కోదాడ మో టార్ వెహికల్ ఇనస్పెక్టర్ కార్యాలయంలో ఆనలైన బిడ్డింగ్‌లో టీజీ29ఏ 9999 నెంబర్‌కు రికార్డు స్థా యిలో 3,50,999 ఆనలైనలో ప్రభుత్వానికి చెల్లించి తనకు నచ్చిన నెంబర్‌ను దక్కించుకున్నారు.