చిట్టీలు, అధిక వడ్డీల పేరిట రూ.1.50కోట్లు వసూలు
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:59 PM
చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ, అధిక వడ్డీ ఇస్తామంటూ అప్పు తీసుకుని రూ.1.50కోట్లు సొంతానికి వాడుకున్న నిర్వాహకుడిని, దివాళా పిటీషన (ఐపీ) పెట్టేందుకు సహకరించిన మరో ముగ్గురిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టూటౌన పోలీసులు అరెస్టు చేశారు.
మిర్యాలగూడ అర్బన, జూలై 1 (ఆంధ్రజ్యోతి): చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ, అధిక వడ్డీ ఇస్తామంటూ అప్పు తీసుకుని రూ.1.50కోట్లు సొంతానికి వాడుకున్న నిర్వాహకుడిని, దివాళా పిటీషన (ఐపీ) పెట్టేందుకు సహకరించిన మరో ముగ్గురిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టూటౌన పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం టూటౌన పోలీ్‌స్‌స్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సోమనర్సయ్య ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన కటకం సైదిరెడ్డి కొన్నేళ్లుగా పట్టణంలోని శాంతినగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ బియ్య వ్యాపారం చేస్తూ స్థానికులకు సన్నిహితంగా మెలిగేవాడు. దీంతోపాటు అనుమతి లేకుండా సంతో్‌షనగర్, శాంతినగర్, రెడ్డికాలనీల్లో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల విలువైన చిట్టీ వ్యాపారం నడుపుతున్నాడు. 42మంది వినియోగదారుల నుంచి వసూలు చేసిన చిట్టీ డబ్బులతోపాటు మరికొంతమందికి అధిక వడ్డీ ఆశ చూపి తీసుకున్న నగదు మొత్తం రూ.1.50కోట్లు వారికి చెల్లించాల్సి ఉంది. తీసుకున్న అప్పు, చిట్టీల డబ్బు చెల్లింపును ఏడాదిగా వాయిదా వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జూన 17వ తేదీన శాంతినగర్‌లో ఉంటున్న సైదిరెడ్డి ఇంటికి తాళం వేసి ఉండటం, ఫోన స్విచ ఆఫ్‌లో ఉండటంతో బాధితులు జూన 24వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు సైదిరెడ్డి రూ.1.50కోట్లు చెల్లించాల్సి ఉందని, ఈ విషయమై గతంలో ప్రశ్నించినపుడు తమను బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దివాళా పిటీషన పెట్టేందుకు వచ్చి...
కోర్టులో దివాళా పిటీషన దాఖలు చేసేందుకు న్యాయవాదిని సంప్రదించే క్రమంలో సైదిరెడ్డి స్థానికుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. స్థానిక శ్రీమన్నారాయణ ఫంక్షనహాల్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ హరీ్‌షరెడ్డి సిబ్బందితో అక్కడికి వెళ్లగా పారిపోయేందుకు యత్నించిన సైదిరెడ్డిని అదు పులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. సైదిరెడ్డి నుంచి 46చిట్టీ పుస్తకాలు, రూ.72 లక్షలు అప్పు ఉన్నట్లుగా నిర్ధారించే 50ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీ దాఖలు చేసేందుకు శాంతినగర్‌కాలనీకి చెందిన సైది రెడ్డి సోదరుడు కటకం వెంకట్‌రెడ్డి, ముత్తిరెడ్డికుంటకు చెందిన మామిళ్ల వెంకన్న, రాంనగర్‌కు చెందిన గుణగంటి జానయ్య, మరో ఇద్దరు సహకరించినట్లు విచారణలో తెలసుకున్నారు. సైదిరెడ్డి, వెంకటరెడ్డి, వెంకన్న, జానయ్యలను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఎస్‌ఐ తెలిపారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు సారధ్యంలో కేసు విచారణ కొనసాగుతోందన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు రాంబాబు, హరీ్‌షరెడ్డి పాల్గొన్నారు.