రజతోత్సవానికి గులాబీ దళం
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:08 AM
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణు లు సిద్ధమయ్యాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి లో ఆదివారం జరిగే ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి లక్షమంది వరకు తరలివెళ్లేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి జిల్లా నుంచి లక్షమందిని తరలించేందుకు ఏర్పాట్లు
వాహనాలను ఇప్పటికే సిద్ధం చేసిన పార్టీ నేతలు
మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు
జనసమీకరణకు రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యేలు
సభ ద్వారా పార్టీ భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తారని అంచనా
హన్మకొండ జిల్లాలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభా వేదిక
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) : బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణు లు సిద్ధమయ్యాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి లో ఆదివారం జరిగే ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి లక్షమంది వరకు తరలివెళ్లేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. సభ అనంత రం పార్టీ సం స్థాగత పదవులు భర్తీచేసే అవకాశం ఉండటంతో ఆ శావహులంతా పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు.
రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి నే తృత్వంలో మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా ఇప్పటికే గ్రామస్థాయి మొదలు నియోజకవర్గ స్థాయి వరకు సన్నాహక సమావేశాలు పూర్తిచేశారు. రజతోత్సవసభ పూర్తయ్యాక పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర కార్యవర్గంవరకు సంస్థాగతంగా కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. దీంతో ఈ సభను విజయవంతం చేయడం ద్వారా పార్టీలో తమ స్థానాన్ని పదిలపరచుకోవాలని, అధిష్ఠానం దృష్టి లో పడడం ద్వారా పార్టీ పదవు లు దక్కించుకోవాలని క్యాడర్ సన్నద్ధమవుతోంది.ఆదివారం ఉదయం నుంచే రజతోత్సవ సభకు వెళ్లేందుకు వీలుగా ఇప్పటికే వాహనాలను బుక్ చేసుకోగా, శనివారం మధ్యా హ్నం నుంచే ఉమ్మడి జిల్లా లో బీఆర్‌ఎస్ రజతోత్సవ సందడి మొదలైంది.
ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మంది..
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సుమారు లక్షమంది తరలివెళ్లేలా పార్టీనేతలు సన్నాహాలు చేశారు. ప్రధానంగా సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల నుంచి 50వేల మంది వెళ్లేలా ఏర్పాట్లు చేయగా, మిగిలిన నియోజకవర్గాల నుం చి మరో 50వేల మంది సభకు వెళ్లేందుకు వీలుగా వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులతో పాటు కార్లను ఇప్పటికే అందుకు బుకింగ్ చేశా రు. ఉదయాన్నే బయలుదేరి వెళ్లేలా, మార్గమధ్యలోనే మఽ ద్యాహ్న భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు పార్టీ నా యకులు తెలిపారు. ప్రధానంగా యువత, మహిళలు పెద్దసంఖ్యలో సభకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డితో పాటు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా సభకు వెళ్లే ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రఽ దానంగా రవాణాపరంగా ఇబ్బందులు లేకుండా చూడాల ని, ముందుగా నిర్ణయించుకున్న మార్గాల్లోనే వాహనాలు వెళ్లాలని ఇన్‌చార్జీలకు స్పష్టంగా సమాచారం ఇచ్చారు.
గుర్తింపునకు అవకాశంగా భావిస్తున్న క్యాడర్
పార్టీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో తమ కృషిని చాటుకోవడం ద్వారా పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడేలా నాయకులు పనిచేస్తున్నారు. సభ కు వాహనాలు, జనసమీకరణ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యేలే చూస్తున్నా, వీలైనంత ఎక్కువ మందిని తరలించడంలో వారికి తోడ్పాటుగా ఉండేలా క్యాడర్ పనిచేస్తోంది. ఈ సభ ముగిశాక గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీల నియామకాలు ఉంటాయని, పార్టీని సంస్థాగతంగా బలంగా... తీర్చిదిద్దడమే గాకుండా క్యాడర్‌కు శిక్షణాతరగతులు సైతం నిర్వహించి నిర్మాణాత్మక పాత్ర పోషించేలా తయారుచేస్తామని ఇటీవల పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభ ముగిశాక ఆ కార్యాచరణ మొదలవుతుందని క్యాడర్ భావిస్తోంది. అదే సమయంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీచేసేందుకు సిద్ధమవుతున్న స్థానిక నాయకులు సభకు జనసమీకరణ చేసేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో క్యాడర్ చేజారకుండా వారందరినీ సభకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సభలో కేసీఆర్ ప్రసంగం ద్వారా పార్టీకి పునరుత్తేజం వస్తుందని, సభ తర్వాత ప్రతిపక్షంగా పార్టీ కార్యాచరణ వేగవంతమవుతుందనే నమ్మకం క్యాడర్‌లో నెలకొంది.
ఎడ్లబండ్లు, పాదయాత్రలు, సైకిల్‌యాత్రలు
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరు(ఎస్) మండలం నుంచి 16 ఎడ్లబండ్ల ద్వారా కార్యకర్తలు తరలివెళ్లారు. పలువురు యువనాయకులు, కార్యకర్తలు సైకిల్‌యాత్రల ద్వారా వెళ్తుండగా, కొందరు విద్యార్థులు, యువత పాదయాత్రగా వెళ్తున్నారు. మొత్తంగా పార్టీలో నూతనోత్సాహం కలిగేలా సభ నిర్వహిస్తామని, పార్టీని ముందుకు నడపడానికి ఈ సభ చక్కటి మార్గదర్శనం చేస్తుందని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు.
నల్లగొండ జిల్లా నుంచి 40వేల మంది
బీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్
దేవరకొండ, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి 40వేల మందికిపైగా నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నట్లు బీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. శనివారం దేవరకొండలో విలేకరులతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే రజతోత్సవ సభకు కనీవినీ ఎరగని రీతిలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందన్నారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి వరంగల్ రజతోత్సవ సభకు 5వేల మందిని తరలిస్తున్నట్టు తెలిపారు.