విశ్రాంత సైనికుడు రాజేష్ మృతి
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:06 AM
యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణానికి చెందిన విశ్రాంత సైనికుడు తునికి రాజేష్(44) శుక్రవారం మృతి చెందారు. రెండు నెలల కిందటే ఉద్యోగ విరమణ చేశారు.
2016 సర్జికల్ సై్ట్రక్‌లో కీలకపాత్ర
నేడు భువనగిరిలో అంత్యక్రియలు
భువనగిరి టౌన, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణానికి చెందిన విశ్రాంత సైనికుడు తునికి రాజేష్(44) శుక్రవారం మృతి చెందారు. రెండు నెలల కిందటే ఉద్యోగ విరమణ చేశారు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఇటీవలే కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరగగా చికిత్సపొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. 2016 సెప్టెంబర్‌లో పాకిస్థానలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ సై్ట్రక్‌లో పారా రెజిమెంట్ సైనికుడిగా కీలకపాత్ర పోషించారని సన్నిహితులు తెలిపారు. రాజేష్ తండ్రి తునికి నరసింహ సైన్యంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆయన మృతి చెందారు. సోదరుడు కిషోర్ కూడా విశ్రాంత సైనికుడే. రాజే్‌షకు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. భువనగిరి ధోబీవాడలోని స్వగృహం నుంచి శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రాజేష్ మృతికి పలువురు సంతాపం తెలిపారు.