రాష్ట్రంలో నిర్బంధ పాలన సాగుతోంది
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:48 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన కొనసాగిస్తోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వర్లు అన్నారు.

సూర్యాపేటఅర్బన, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన కొనసాగిస్తోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వర్లు అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడనే కారణంతో కక్షపూరితంగా ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు గండూరి ప్రకాష్, నిమ్మల శ్రీనివా్‌సగౌడ్, పుట్ట కిషోర్, జీడి భిక్షం, సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులుగౌడ్, తాహెర్‌పాషా, ఆకుల లవకుశ పాల్గొన్నారు.
తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య స్పీకర్ నిర్ణయాన్ని ఖండించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, గుండగాని దుర్గయ్య, గాజుల యాదగిరి, గోపగాని శ్రీను, నరేష్, విరోజి, కొండగడుపుల వెంకటేష్, సాయికిరణ్ పాల్గొన్నారు.
అర్వపల్లి : ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డిను సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని మాజీ జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్ అన్నారు. గురువారం అర్వపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉందన్నారు. హక్కులను కాలరాయడం కాంగ్రె్‌సకే చెల్లిందన్నారు. సమావేశంలో నాయకులు నరేష్, వెంకన్న, లింగయ్య పాల్గొన్నారు.
హుజూర్‌నగర్ : జగదీ్‌షరెడ్డిని సస్పెండ్ చేసిన ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమని మాజీ జడ్పీటీసీ, బీఆర్‌ఎస్ నాయకుడు కొప్పుల సైదిరెడ్డి అన్నారు. గోపాలపురంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు చీకూరి రాజారావు, సుందరయ్య, ఉపేందర్, షేక్ హుస్సేన్, సైదులు, ఏడుకొండలు, మట్టపల్లి పాల్గొన్నారు.
నాగారం: జగదీ్‌షరెడ్డి సస్పెన్షనను నిరసిస్తూ మండలకేంద్రంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు గుండగాని అంబయ్యగౌడ్, నాయకులు బాలమల్లు, మల్లేష్, ఈరెటి అంజయ్య, సోమయ్య, సోమిరెడ్డి, వెంకన్న, మధుసూదనరెడ్డి పాల్గొన్నారు.