Share News

విశ్రాంత ఆవేదన

ABN , Publish Date - May 08 , 2025 | 12:36 AM

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీసు (30-40 సంవత్సరాలు) వరకు ఉంటుంది. ఆ క్రమంలో పిల్లల చదువుల, పెళ్లిళ్ల కోసం కొందరు, ఇళ్లు కట్టుకొని, కొనుక్కొని ప్రశాంతంగా జీవించాలని మరి కొందరు జీపీఎఫ్‌, సరెండర్‌, ఎన్‌క్యా్‌షమెంట్‌ లీవులు, గ్రాట్యూటీ రూపంలో డబ్బులు దాచుకుంటారు

 విశ్రాంత ఆవేదన

ఒక్కొక్కరికీ రూ50నుంచి 70లక్షల వరకు బకాయిలు

సంవత్సరంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,037మంది రిటైర్డ్‌

ఇప్పటికీ అందని ప్రయోజన బకాయిలు

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీసు (30-40 సంవత్సరాలు) వరకు ఉంటుంది. ఆ క్రమంలో పిల్లల చదువుల, పెళ్లిళ్ల కోసం కొందరు, ఇళ్లు కట్టుకొని, కొనుక్కొని ప్రశాంతంగా జీవించాలని మరి కొందరు జీపీఎఫ్‌, సరెండర్‌, ఎన్‌క్యా్‌షమెంట్‌ లీవులు, గ్రాట్యూటీ రూపంలో డబ్బులు దాచుకుంటారు. అన్ని కలిపి ఒక్కొక్కరికి రూ.50నుంచిరూ. 70లక్షల వరకు దాచుకున్న డబ్బులను రిటైర్మెంట్‌ అయిన నెలకు లేదంటే రెండు నెలల్లో ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరం దాటినా తాము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో రిటైర్‌ అయిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము దాచుకున్న డబ్బు కోసం నిరసన తెలపాల్సి రావడం బాధాకరమని పేర్కొంటున్నారు. దాచుకున్న డబ్బులు అవసరానికి వస్తాయని ఆశపడ్డామని తెలిపారు.

నిరసనలు చేయాల్సిరావడం బాధాకరం : మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

2021నుంచి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం ఇబ్బందులు రిటైర్‌ అయిన వారు ఇబ్బందులు పడాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. సకాలంలో బెనిఫిట్స్‌ ఇవ్వాలని గతంలో శాసనమండలిలో మాట్లాడినట్లు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. ఏప్రిల్‌ నెలలో ఇందిరా పార్కు వద్ద రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం పెన్షనర్లు సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని, బెనిఫిట్స్‌ కోసం డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

తాము దాచుకున్న సొమ్ము (డబ్బు) కోసం రిటైర్డ్‌ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2024 జనవరి నుంచి 2025 ఏప్రిల్‌ వరకు 1,037మంది ఉద్యో గ, ఉపాధ్యాయులు రిటైర్‌ అయ్యా రు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం కొందరు, ఇళ్లు కట్టుకొని, కొనుక్కొని ప్రశాంతంగా జీవించాలని మరి కొందరు జీపీఎఫ్‌, సరెండర్‌, ఎన్‌క్యా్‌షమెంట్‌ లీవులు, గ్రాట్యూ టీ రూపంలో డబ్బులు దాచుకున్నా రు. ఆ డబ్బులు చేతికి అందకపోవ డంతో నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా సీనియారిటీ ప్రాతిపదికన బెనిఫిట్స్‌ ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- ఆంధ్రజ్యోతి- కోదాడ

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇస్తే ఇబ్బందులు ఉండవు

నేను సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరహైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేసి 2024 మేలో రిటైర్డ్‌ అయ్యా. ఉద్యోగ విరమణ చేసి సంవత్సరం అయినా నేటికీ రిటైర్మెంట్‌ ప్రయోజనాలు అందలేదు. రిటైర్‌కు ముందు జీతం లక్ష వచ్చేది. ఇంటి కోసం రుణం తీసుకున్నాను. రుణం కింది రూ.40 వేలు కట్‌ అయ్యేది. రిటైర్‌ అయ్యాక జీతం రూ.50వేలు వస్తోంది. లోన్‌ కింద రూ.40వేలు పోతే, మిగిలేది రూ.10 వేలు. వాటితో కుటుంబం ఎలా గడవాలి. అంతేకాక వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆస్పత్రికి వెళ్లలన్నా డబ్బులు ఉండడం లేదు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇస్తే ఇబ్బందులు ఉండవు. దాచుకున్న డబ్బుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.

- చుండూరు ప్రసాద్‌, రిటైర్డ్‌ స్కూల్‌ అసిస్టెంట్‌.

అప్పు ఇచ్చినవారు అడుగుతున్నారు

నేను సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం యతిరాజపురం తండాలో ఎస్జీటీగా పనిచేసి గతేడాది రిటైర్‌ అయ్యా. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వస్తాయనే ఆలోచనతో, ఫిబ్రవరిలో పాప పెళ్లి చేశా. సంవత్సరం గడుస్తున్నా బెనిఫిట్స్‌ రాకపోవడం, పెళ్లి కోసం అప్పులు, కొన్ని డబ్బులు చే బదులు తెచ్చా. అప్పు ఇచ్చినవారు అడుగుతున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్న. డబ్బులు ఇవ్వలేక మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తోంది.

- సంకతాల గోవిందరావు, రిటైర్డ్‌ ఎస్జీటీ.

అప్పులు తెచ్చి అమ్మాయిల పెళ్లిళ్లు చేశా

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంటలో హైస్కూల్‌లో ఎస్జీటీగా పనిచేస్తూ ఆగస్టు 2024లో రిటైర్‌ అయ్యా. 50లక్షల వర కు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రావాల్సి ఉంది. ఇద్దరు అమ్మాయిల పెళ్లిల కోసం అప్పులు తెచ్చా. అంతేకాక వారికి కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉం ది. బెనిఫిట్స్‌ అందకపోవడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను.

- తెల్లకూల నాగేశ్వరరావు, రిటైర్డ్‌ ఎస్జీటీ.

Updated Date - May 08 , 2025 | 12:36 AM