Share News

ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నావని మందలింపు

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:04 AM

చింతలపాలెం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నావని మందలించటంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. బుధవారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని జువారి సిమెంట్‌ ఫ్యాక్టరీ కాలనీలో ఈ సంఘటన జరిగింది.

ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నావని మందలింపు

ఫ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఘటన

చింతలపాలెం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నావని మందలించటంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. బుధవారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని జువారి సిమెంట్‌ ఫ్యాక్టరీ కాలనీలో ఈ సంఘటన జరిగింది. చింతలపాలెం ఎస్‌ఐ సందీ్‌పరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా రాజులపేటకు చెందిన కాశిబోయిన శ్రీనాథ్‌ జువారి సిమెంట్‌ పరిశ్రమ పాఠశాలలో మ్యాథ్స్‌ ఉపాధ్యాయుడిగా 2019నుంచి పనిచేస్తున్నాడు. భార్య మౌనిక (30), కుమారుడు, కుమార్తెతో కలిసి పరిశమ్రలోని కార్వర్ట్స్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీనాథ్‌ భోజనానికి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో మౌనిక తమను పట్టించుకోకుండా ఫోన్‌లో మాట్లాడటాన్ని శ్రీనాథ్‌ గమనించి, ఇటీవల ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతున్నావని మందలించాడు. మధ్యాహ్న సమయంలో పిల్లలు ఇంటికి వచ్చి చూడగా, తల్లి మౌనిక సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. తండ్రికి సమాచారమిచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీ్‌పరెడ్డి తెలిపారు.

Updated Date - Jul 25 , 2025 | 01:04 AM