ప్రమాదరహిత నిర్వహణతో వికసిత భారత కల సాకారం
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:07 AM
ప్రమాద రహిత నిర్వహణతోనే వికసిత భారత లక్ష్యాలకు చేరుకోవచ్చని నల్లగొండ జిల్లా డిప్యూటీ చీఫ్ ఇనస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కేవీ శ్రీదేవి అన్నారు.

మేళ్లచెర్వు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ప్రమాద రహిత నిర్వహణతోనే వికసిత భారత లక్ష్యాలకు చేరుకోవచ్చని నల్లగొండ జిల్లా డిప్యూటీ చీఫ్ ఇనస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కేవీ శ్రీదేవి అన్నారు. మం డల కేంద్రంలోని మైహోం సిమెంట్ ఇండసీ్ట్రస్ ఆడిటోరియంలో మంగళవారర 54వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు సమావేశాన్ని ప్లాంట్ హెడ్ శ్రీనివా్‌సరావుతో కలిసి జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడు తూ పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా జీరో యాక్సిడెంట్ ని నాదంతో కార్మికులు పనిచేయాలన్నారు. పరిశ్రమలలో ప్రమాదం జరగటం వల్ల ఆర్థికంగా పరిశ్రమలు నష్టపోతాయని, అందువల్ల పరిశ్రమ యాజమాన్యం ప్రమాదాలపై అశ్రద్ధ వహించకుండా భద్రతపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కర్మాగార శాఖ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రమాద రహిత శిక్షణ కార్యక్రమాలను కంపెనీ యాజమాన్యాలు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ ఎన శ్రీనివాసరా వు, వైస్‌ప్రెసిడెంట్ ఉత్తమ్‌సింగ్, సేఫ్టీ డీజీఎం సూర్యనారాయణ, జీఎం నాగేశ్వరరావు, కంపెనీ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.