Share News

అర్హులైన పేదలకే రేషనకార్డులివ్వాలి

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:40 AM

రేషనకార్డులు అర్హులైన పేదలందరికీ అందాలే తప్ప దళారులకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఇస్తే బీజేపీ ఊరుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన రాంచందర్‌రావు అన్నారు.

అర్హులైన పేదలకే  రేషనకార్డులివ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

భానుపురి, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : రేషనకార్డులు అర్హులైన పేదలందరికీ అందాలే తప్ప దళారులకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఇస్తే బీజేపీ ఊరుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన రాంచందర్‌రావు అన్నారు. సోమవారం సూర్యాపేటలో బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రానున్న ప్రభుత్వం బీజేపీదన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల పాలనను ప్రజలు చూశారన్నారు. నరేంద్రమోదీ పాలనలో దేశం అభివృద్ధి సాధిస్తోందని, రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత ఉందన్నారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తోందన్నారు. ఆయుష్మాన భారత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. రేషనలో 80శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయన్నారు. రేషన కార్డులపై ప్రధాని నరేంద్రమోదీ చిత్రం వేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు ఎందుకు చేయడంలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం ఓబీసీలకు రిజర్వేషన కల్పించడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని, అందులో 10శాతం ముస్లింలకు ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. బీజేపీ కార్యాలయం కేంద్రంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కోరారు. పార్టీ రోజురోజుకూ విస్తరిస్తోందన్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు భయపడుతున్నాయ్‌

రాంచందర్‌రావు బీజేపీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు భయపడుతున్నాయని, హెచసీయులో రోహిత ఆత్మహత్యకు రాంచందర్‌రావుకు ముడిపెట్టడం కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిలు అన్నారు. రాంచందర్‌రావు నియామకంతో తెలంగాణ ఉద్యమం లాగానే బీజేపీ కార్యకర్తల్లో జోష్‌ వచ్చిందన్నారు. రాష్ట్రమంతా సూర్యాపేట వైపు చూస్తోందన్నారు. ప్రతీ కార్యకర్త రోజుకు 30 నిమిషాలు బూత స్థాయిలో పనిచేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనను ప్రజలు నమ్మడం లేదన్నారు. కార్యకర్తలందరూ కష్టపడి పని చేస్తే వచ్చే ఎన్నికల్లో విజయం తధ్యమన్నారు. అంతకుముందు జనగాం క్రాస్‌రోడ్డు నుంచి భారీ ర్యాలీతో బీజేపీ శ్రేణులు స్వాగతం పలికాయి. కార్యక్రమంలో యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌, సుగుణారెడ్డి, బొబ్బా భాగ్యారెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, కడియం రామచంద్రయ్య, సలిగంటి వీరేంద్ర, కర్నాటి కిషన, నూనె సులోచన, చల్లమల్ల నర్సింహ, రంగరాజు రుక్మారావు, కాప రవి, మన్మథరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభారి రాజమౌళి పాటతో సభను ఉత్తేజపరిచారు. కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీటీసీ ఆకుల అరుణ, విశ్రాంత ప్రిన్సిపాల్‌ బిక్షమయ్య బీజేపీలో చేరారు. తెలంగాణ అర్చక సమాఖ్య బృందం, వసంత సత్యనారాయణపిళ్లే, కార్యకర్తలు పెద్దఎత్తున రాంచందర్‌రావును సన్మానించారు.

Updated Date - Jul 15 , 2025 | 12:40 AM