బార్ అసోసియేషన్ ఎన్నికల్లో రామిరెడ్డి విజయం
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:20 AM
హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సాముల రామిరెడ్డి ప్యానెల్ విజయం సాధించింది.
13 పదవులను దక్కించుకున్న ప్యానెల్
హుజూర్‌నగర్ , ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సాముల రామిరెడ్డి ప్యానెల్ విజయం సాధించింది. 20 ఏళ్లకుపైగా బార్ అసోసియేషన అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాంరెడ్డి మరోసారి అధ్యక్ష పదవికి పోటీచేసి విజ యం సాధించి అసోసియేషనపై పట్టు నిలుపుకున్నారు. అంతేకాకుండా మొ త్తం 13 పదవులను ఆయన ప్యానెల్ తరుపున పోటీచేసిన న్యాయవాదులే గెలుపొందారు. శుక్రవా రం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. 3 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఓట్లు లెక్కించారు. అసోసియేషనలో 83 మంది సభ్యులు ఉండగా 82 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి రామిరెడ్డికి 61ఓట్లు రాగా, ప్రత్యర్థి జక్కుల వీరయ్యకు 20 ఓట్లు వచ్చాయి. రామి రెడ్డి 41 ఓట్లతో గెలుపొందారు. అదేవిధంగా ఒక ఓటు చెల్లుబాటు కాలేదు. ఉపాధ్యక్ష పదవికి జక్కుల నాగేశ్వరరావు తన ప్రత్యర్థి కుక్కడపు సైదులుపై 31 ఓట్లతో, ప్రధానకార్యదర్శి పదవికి చెనగాని యాదగిరి తన ప్రత్యర్థి భూక్యా నాగేశ్వరరావుపై 41 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా కొట్టు సురేష్ తన ప్రత్యర్థి మద్దుల నాగేశ్వరరావు పై 49 ఓట్లతో, కోశాధికారి పదవికి ఉప్పల గోపాలకృష్ణ తన ప్రత్యర్థి నీలం విజయదుర్గపై 53 ఓట్లతో గెలుపొందారు. గ్రం థాలయ కార్యదర్శి పదవికి విశ్వనాథం తన ప్రత్యర్థి కొణతం శ్రీనివాసరెడ్డిపై 17 ఓట్లతో, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా గొల్లగోపు నవీన్ తన ప్రత్యర్థి వెంకటే్‌షనాయక్‌పై 63 ఓట్లతో గెలుపొందారు. కాగా ఐదుగురు కార్యవర్గ సభ్యుల పదవులకు జరిగిన ఎన్నికల్లో 8మంది పోటీ చేయగా సైదా హుస్సేన్‌కు 72 ఓట్లు, చిట్టిపోతుల రమే్‌షకు 70 ఓట్లు, నాగార్జునకు 67, శ్రీనివాసుకు 68, ప్రశాంత్‌కు 64 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు సుందర రాఘవరావు, వట్టికూటి అంజయ్య తెలిపారు. విజేతలకు ధ్రువీకరణపత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. నూతన కోర్టు ల భవన నిర్మాణాలకు నిరంతరం పాటుపడతానన్నారు. న్యా యవాదులందరికీ సహకారం అందిస్తామన్నారు. తనతో పా టు తన ప్యానెల్‌ను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.