‘రైతు భరోసా’ షురూ
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:30 AM
ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుభరోసా నిధులను విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో మొదటి విడతగా సోమవారం సాయంత్రం 4,36,994 మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ.411,34, 37,747 విడుదల చేసింది. ఈ నిధులు సోమవారం సాయంత్రం నుంచే జమకావడం ప్రారంభమైందని నల్లగొండ జిల్లా వ్యవసా య అధికారి పి.శ్రవణ్‌కుమార్ తెలిపారు.
సోమవారం సాయంత్రం నుంచే జమ
నల్లగొండ జిల్లాకు రైతుభరోసా నిధులు రూ.411కోట్లు
రెండో విడతలో రూ.327కోట్ల కు పైగా జమచేయనున్న ప్రభుత్వం
సాగు చేసే భూమి అంతటికీ పెట్టుబడి సాయం
నల్లగొండ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుభరోసా నిధులను విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో మొదటి విడతగా సోమవారం సాయంత్రం 4,36,994 మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ.411,34, 37,747 విడుదల చేసింది. ఈ నిధులు సోమవారం సాయంత్రం నుంచే జమకావడం ప్రారంభమైందని నల్లగొండ జిల్లా వ్యవసా య అధికారి పి.శ్రవణ్‌కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 5,65,803 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.738,67,60,000లకు పైగా నిధులను కేటాయించింది. మొదటి విడతగా రూ.411కోట్లకు పైగా విడుదల చేయగా, రెండో విడతలో రూ.327కోట్లకు పైగా నిధులు విడుదల కానున్నాయి. వచ్చే తొమ్మిది రోజుల్లో పూర్తిస్థాయిలో రైతుభరోసా నిధులు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు. రైతుభరోసాను ఎలా ముందుకు తీసుకెళ్తారో వివరించారు. సాగుచేసే భూమి అంతటికీ రైతుభరోసాను చెల్లిస్తామని ప్రకటించారు. వాస్తవానికి ఒకేసారి రైతులందరికీ రైతుభరోసా చెల్లించాలని నిర్ణయించగా, నిధులను బట్టి తొమ్మిది రోజుల్లో చెల్లింపులు మొత్తం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత యాసంగి సీజన్‌లో కేవలం నాలుగు ఎకరాలకు మాత్రమే రైతుభరోసాను చెల్లించిన ప్రభుత్వం ఈసారి మాత్రం ఎంత భూమి ఉన్నా ఆ మేరకు రైతుభరోసా సాయం అందించనుంది. అయితే సాగు చేసే భూమి అయితేనే నగదు అందుతుంది. ఇప్పటికే భూభారతి పోర్టల్ ఆధారంగా సాగుచేసే భూమి వివరాలను సేకరించిన ప్రభుత్వం గుట్టలు, వెంచర్లు, ఇతర సాగులో లేని భూములకు పెట్టుబడి సాయాన్ని నిలిపివేసింది.
యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో..
సూర్యాపేట జిల్లాలో 3,06,619 రైతుల భూఖాతాలు ఉండగా, మొత్తం 3,73,175 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ భూమి అంతటికీ ఎకరాకు రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ ప్రారంభమైంది. యాదాద్రి జిల్లాలో 2,83,872 రైతుల ఖాతాలు ఉండగా, 3,39,332 ఎకరాల సాగుభూమి ఉంది. యాదాద్రి జిల్లాలో కూడా రైతుభరోసా నిధులు జమ చేయడం ప్రారంభించారు. వానాకాలం సీజన్ ప్రారంభంలోనే నిధులు జమవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఈ ప్రక్రియ మొత్తాన్ని తొమ్మిది రోజుల్లో ప్రభుత్వం పూర్తి చేయనుండటంతో వానాకాలం సాగుకు ఇబ్బందులు తప్పుతాయని రైతులు భావిస్తున్నారు.
అర్హులైన ప్రతీ రైతుకు రైతుభరోసా : పి. శ్రవణ్‌కుమార్, నల్లగొండ జేడీఏ.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతుభరోసా నగదు తొమ్మిది అర్హులైన ప్రతీ రైతుకు అందుతుంది. సోమవారం సాయ ంత్రం నుంచే రైతుభరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకావడం ప్రారంభమైంది. వ్యవసాయాన్ని పండుగగా మార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద మొత్తంలో చేపడుతోంది. అందులో భాగంగానే పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేస్తోంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుభరోసా నిధులు జమ అవుతున్నాయి. ప్రతీ రైతు పెట్టుబడి సా యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. త్వరలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు పనిముట్లు అందజేస్తాం.