రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:02 AM
వివిధ రోగాలతో ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్‌అక్తర్ అన్నారు.
మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్
చౌటుప్పల్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): వివిధ రోగాలతో ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్‌అక్తర్ అన్నారు. మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్ట్ సెంటర్‌ను చైర్మన్ పరిశీలించారు. ఆస్పత్రిలోని మెడికల్, క్యాజువాలిటీ, ఐసీయూ, మెడిక ల్ కేర్, జనరల్ సర్జికల్ వార్డు, మెడికల్ స్టోర్, డయాలసిస్, ఎక్స్‌రే తదితర వార్డులను పరిశీలించి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి భవన పనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆస్పత్రిలో కావలసిన అన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూ చించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆస్పత్రి నిర్వహణ తీరు సం తృప్తికరంగా ఉందన్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిలో జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పాలియేటివ్ కేర్ ద్వారా ఆసుపత్రిలో రోగుల కు మంచి సేవలు అందిస్తున్నారని, ఆస్పత్రికి రాలేని స్థితిలో ఉన్న వారికి సైతం వారి ఇంటి దగ్గర మెరుగైన వైద్యం అందించడం అభినందనీయమన్నా రు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని చైర్మన్‌ను ఆదేశించారు. తమ పరిశీలనలో గుర్తించిన అంశాలపై అవసరమైతే ప్రభుత్వానికి సూచనలు చే స్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో శేఖర్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి మనోహర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నా నాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో య శోద, వైద్యులు అలివేలు, చింతకింది కాటంరాజు, అధికారులు పాల్గొన్నారు.