నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:25 AM
మహిళా శక్తి భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో కొనసాగుతున్న భవ న నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. మహిళా శక్తి భవనంలో జిల్లా సమాఖ్య ప్రధా న కార్యాలయం, శిక్షణా కేంద్రం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ నిర్మాణాల వివరా లు అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ ఎం.హనుమంతరావు
భువనగిరిలో మహిళా శక్తి భవన పనుల పరిశీలన
భువనగిరి (కలెక్టరేట్), ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మహిళా శక్తి భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో కొనసాగుతున్న భవ న నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. మహిళా శక్తి భవనంలో జిల్లా సమాఖ్య ప్రధా న కార్యాలయం, శిక్షణా కేంద్రం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ నిర్మాణాల వివరా లు అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ పనులను వేగవంతంచేసి, అక్టోబరు చివరి వరకు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి
యాదగిరిగుట్ట రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. మంగళవారం యాదగిరిగుట్టలోని రెండో వార్డు యాదగిరిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. శ్లా బ్ దశలో ఉన్న గుంటిపల్లి రేణుక ఇంటిని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలు పూర్తి చే సుకుంటున్న అందరికీ తప్పకుండా బిల్లులు వస్తాయన్నారు. ఆయనవెంట మున్సిపల్ కమిషనర్ మిర్యాల లింగస్వామి ఉన్నారు.
నేటి నుంచి అధికారుల ‘పల్లె నిద్ర’
భువనగిరి (కలెక్టరేట్): నేటి నుంచి అధికారులు ‘పల్లె నిద్ర’ చేస్తారని, రాజాపేట మండలం దూదివెంకటాపురం నుంచి ప్రారంభం అవుతుందని కలెక్టర్ ఎం హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లోని సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కరించేందుకు రాత్రి బస చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం సాయంత్రం రాజాపేట మండలం దూదివెంకటాపురంలో గ్రామస్థులతో ముఖాముఖిలో పాల్గొంటామని తెలిపారు.
వన మహోత్సవం లక్ష్యం సాధించాలి
జిల్లాలో 2.50 లక్షల మొక్కలు నాటే లక్ష్యం సాధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. వన మహోత్సవం విజయవంతం చేయడానికి గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు సమన్వయంగా వ్యవహరించాలన్నారు.
రోగులకు మెరుగైన సేవలందించాలి
రాజాపేట: ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగై న వైద్య సేవలు అందించాలని కలెక్టర్ హనుమంతరా వు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని రోగుల ను అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట ఎంపీడీవో నాగవేణి, మండల వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, తదితరులు ఉన్నారు.