Share News

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:56 AM

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీనకుమార్‌ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
మాధాపూర్‌లో విద్యార్థులకు షూస్‌ అందజేస్తున్న ఎమ్మెల్సీ మల్లన్న, కలెక్టర్‌ హనుమంతరావు

తుర్కపల్లి/ రాజాపేట, జూలై 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీనకుమార్‌ అన్నారు. బుధవారం మండలంలోని మాధాపూర్‌లో తీన్మార్‌ మల్లన్న ప్రథమ పుత్రిక చింతపండు సక్పాల్‌ పటేల్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా షూస్‌(బూట్లు) కలెక్టర్‌తో హనుమంతరావుతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని మాధాపూర్‌, ఇబ్రహీంపూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడాడారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై భరోసా కల్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు ఉంటాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలల్లోనే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. మాధాపూర్‌లో ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు తిరగొద్దన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు సహా 50పాఠశాలల్లో 2,279 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఈవో సత్యనారాయణ, తహసీల్థార్‌ గుగులోత దేశ్యానాయక్‌, ఎంపీడీఓ లెంకల గీతారెడ్డి తెలంగాణ బీసీ పొలిటికల్‌ జేఏసీ కోఆర్డీనేషన కమిటీ చైర్మన సూదగాని హరిశంకర్‌ గౌడ్‌, ఎంఈవో మాలతి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తీన్మార్‌ మల్లన్న కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజాపేట మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈవో చందా రమేష్‌, ప్రధానోపాధ్యాయులు లెక్కల రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌, మనోజ్‌కుమార్‌, కోటిరెడ్డి, శశికుమార్‌, నాయకులు సూదగాని హరిశంకర్‌గౌడ్‌ పాల్గొన్నారు. కాగా రాజాపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీకి అఖిలపక్ష నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. దాచపల్లి రాజు, గాండ్ల నర్సింగరావు, సత్యనారాయణ, ఉప్పలయ్య ఉన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:56 AM