Share News

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:18 AM

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యరగాని నాగన్నగౌడ్‌ కోరారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది.

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి
పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ప్రతినిధులకు వినతిపత్రం అందజేస్తున్న యరగాని నాగన్న, ఇతరులు

హుజూర్‌నగర్‌ , జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యరగాని నాగన్నగౌడ్‌ కోరారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్టాండింగ్‌ కమిటీసభ్యులకు నాగన్నగౌడ్‌ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. విశాఖ స్టీల్‌ కంపెనీలో 17వేల మంది ఉద్యోగుల్లో 5,500 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించడం సరికాదన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన వేతనాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 12:18 AM