రోడ్లపై నాట్లు వేసి నిరసన
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:29 AM
రోడ్లుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హుజూర్‌నగర్ పట్టణంలోని 5వవార్డులో ప్రజలు రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
హుజూర్‌నగర్ , జూలై 2 (ఆంధ్రజ్యోతి): రోడ్లుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హుజూర్‌నగర్ పట్టణంలోని 5వవార్డులో ప్రజలు రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యువకులు, కాలనీవాసులు మాట్లాడుతూ పట్టణంలోని నాగమయ్యస్వామి దేవాలయం రోడ్డును సీసీగా మార్చాలని అనేక సంవత్సరాలుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కొద్దిపాటి వర్షానికే చిత్తడిచిత్తడి మారుతోందన్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మునిసిపల్ అధికారులు వెంటనే బురదమయంగా ఉన్న రోడ్లను సీసీ రోడ్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు యరగాని శ్రీనివా్‌సగౌడ్, చిలకరాజు లింగయ్య, గంఽధం శ్రీనివాస్, అప్ర్‌ఫఅలీ,రంగారావు, శ్రీనివాసాచారి, ఉపేందర్, రామారావు, బ్రహ్మచారి, సైదులు, కృష్ణారెడ్డి, పాపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.