ఎయిమ్స్‌లో దివ్యాంగుడికి కృత్రిమ కాలు ఏర్పాటు
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:44 AM
బీబీనగర్ ఎయిమ్స్‌లో మేక్ ఇన్ ఇండియా మొదటి డిజైన్ అయిన హై ప్రొఫైల్ కార్బన్ ఫైబర్ ఫుట్ (కృత్రిమ కాలు)ను ఓ దివ్యాంగుడికి అమర్చారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొందించిన ఈ కృత్రిమ కాలును శాస్త్రవేత్త, ఎయి మ్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ సోమవారం ఆవిష్కరించారు.
బీబీనగర్ ఎయిమ్స్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): బీబీనగర్ ఎయిమ్స్‌లో మేక్ ఇన్ ఇండియా మొదటి డిజైన్ అయిన హై ప్రొఫైల్ కార్బన్ ఫైబర్ ఫుట్ (కృత్రిమ కాలు)ను ఓ దివ్యాంగుడికి అమర్చారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొందించిన ఈ కృత్రిమ కాలును శాస్త్రవేత్త, ఎయి మ్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ అహంతేమ్ శాంతా సింగ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టిఫీషియల్ లింబ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, కృత్రిమ అవయవాలు దివ్యాంగులకు సహాయకరంగా ఉంటాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అ త్యవసరంగా గుర్తించిన ఐదు కృత్రిమ అవయవాల్లో తాము ఒకటి రూ పొందించామన్నారు. కృత్రిమ కాలును హై ఎండ్ కార్బన్‌తో రూపొందించామని, ఇది ఖరీదైనప్పటికీ దివ్యాంగులకు వీటిని అమరుస్తున్నామన్నా రు. వీటి తయారీ ద్వారా దేశీయ డిమాండ్‌ను తీర్చడమేగాక అందుబా టు ధరకు, అధిక పనితీరు ఉండే టెక్నాలజీ సహాయంతో కృత్రిమ అవయవాలను రూపొందిస్తున్నామన్నారు. తద్వారా దేశాన్ని గ్లోబల్ హబ్‌గా మారుస్తామన్నారు. కృత్రిమ కాలును భువనగిరికి చెందిన 52 ఏళ్ల దివ్యాంగుడు సంపత్ తిరుమల చవాన్‌కు అమర్చారు. కార్యక్రమంలో మహేశ్వర్‌రెడ్డి లక్కిరెడ్డి, డాక్టర్ వై.రంజిత్‌కుమార్, డాక్టర్ సందీప్ ధోలె, డాక్టర్ దీపాంకర్ సథ్‌పతి, డాక్టర్ సయ్యద్ ఇఫ్తికర్, డాక్టర్ దీపక్‌కుమార్, డాక్టర్ శ్రీకాంత్, రమేష్, డీన్ అభిషేక్ అరోరా, సంగీత, పాల్గొన్నారు.