ధాన్యం కొనుగోళ్లకు ప్రాఽధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - May 01 , 2025 | 01:04 AM
అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రానున్న 15 రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని పూర్తిచేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వారు మాట్లాడారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ఉత్తమ్, తుమ్మల
భువనగిరి (కలెక్టరేట్), ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రానున్న 15 రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని పూర్తిచేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వారు మాట్లాడారు. పక్కా ప్రణాళికతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుం డా ధాన్యం సేకరణ పూర్తిచేయాలన్నారు. రైతు లు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంట నే ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. జిల్లాకు రెండు ధాన్యం ఆరబెట్టే యంత్రాలు కొనుగోలు చేయాల ని ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని, అవసరమైతే గోదాముల్లో ధాన్యం నిల్వ చేయాలన్నారు. వర్షం వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలింపును వేగవంతం చేయాలన్నారు. అందు కు మిల్లర్లు సహరించాలన్నారు. కొంతమంది మిల్లర్లు హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్, 1638 ధాన్యం రకాల్లో నూకలు ఎక్కువగా అవుతున్నాయని చెబుతూ ధాన్యం దిగుమతి చేసుకోవడంలేదని తెలిసిందని, అది సరైన పద్ధతి కాదన్నారు. క్విం టాకు ఐదు నుంచి ఆరు కిలోల మేర తరుగు తీసున్నారనే ఫిర్యాదులున్నాయని, ఎట్టి పరిస్థితు ల్లో మిల్లర్లు తరుగు తీయవద్దన్నారు. పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మాట్లాడు తూ, ధాన్యం సేకరణలో రానున్న 15 రోజులు అతి ముఖ్యమన్నారు. సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి కొనుగోలు ప్రక్రియ ను సజావుగా నిర్వహించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అం దుబాటులో ఉంచాలని సూచించారు.
కలెక్టర్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ, జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు 366 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 76,561 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అందుకు రూ.176.82కోట్లకు రూ.85.66లక్షలు చెల్లింపులు చేశామని వివరించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టీ.నాగిరెడ్డి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి రోజారాణి, డీఎం హరికృష్ణ, డీసీవో మురళి, డీఏవో నీలిమ, తదితరులు పాల్గొన్నారు.