మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వండి
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:29 AM
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి వారి భవిష్యత్‌కు తోడ్పాటు అందించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సంబంధిత అధికారులకు సూచించారు.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు పునాది వేయాలి
వసతిగృహ అధికారుల సమీక్షలో కలెక్టర్
భువనగిరి (కలెక్టరేట్), జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి వారి భవిష్యత్‌కు తోడ్పాటు అందించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి అన్ని వసతి గృహాల ప్రిన్సిపాళ్లు, స్పెషల్ ఆఫీసర్లు, కేర్ టేకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెసిడెన్షియల్ పాఠశాలల మీద నమ్మకం కలిగి ఈ 2025-26 విద్యా సంవత్సరం వసతి గృహాల్లో చదివే విద్యార్థులశా తం పెరిగిందన్నారు. చదువుకోవడానికి సుదూర ప్రాం తాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇక్కడి వాతావరణం అలవాటయ్యే వరకూ ప్రిన్సిపాళ్లు శ్రద్ధ వహించాలని, వారి మానసిక పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యా బోధన చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధవహిస్తూ హాస్టళ్లను ఆర్‌బీఎ్‌సకే బృందాలు సందర్శించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందజేయాలని, వంటకు నాణ్యమైన సరుకులను వినియోగించాలన్నా రు. విద్యార్థుల వసతి గదులు, పడకలు, మూత్రశాలలు శుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. శుద్ధమైన తాగునీటిని అందించాలని చెప్పారు. సమీక్షలో ఆర్సీవోలు విద్యారాణి, స్వప్న, జిల్లా బీసీ సంక్షేమాధికారి యాదయ్య, ఎస్సీ సంక్షేమాధికారి శ్యాంసుందర్, ఎస్టీ సంక్షేమాధికారి నాగిరెడ్డి, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, పలు వసతి గృహాల ప్రిన్సిపాళ్లు, కేర్ టేకర్లు పాల్గొన్నారు.
సీట్ల భర్తీ కోసం లాటరీ
భువనగిరి కేంద్రీయ విద్యాలయంలో రెండో తరగతి లో ఖాళీగా ఉన్న నాలుగు సీట్ల భర్తీ కోసం మంగళవా రం కలెక్టర్ హనుమంతరావు లాటరీ తీసి ఎంపికచేశా రు. లాటరీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, కేంద్రీయ విద్యాలయాల మార్గదర్శకాల ప్రకారం విద్యాలయ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ స్వ యంగా డ్రాతీసి ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ చంద్రమౌళి తెలిపారు. కార్యక్రమంలో మనీషా శుక్లా, శ్రీపాద, ఆనంద్‌కుమార్, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.
మాతృ మరణాలపై కఠిన చర్యలు
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ వహించి జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా చూడాలని కలెక్టర్ హనుమంతరావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం డీఎంహెచ్‌వో మనోహర్ మాతృ మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగిన 52 మాతృ మరణాల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుం డా వైద్యులు ప్రత్యేక శ్రద్ధం వహించాలని, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రసవానికి వచ్చిన గర్భిణులపట్ల జాగ్రత్తగా వ్యవహరించి సాధారణ కాన్పు జరిగేలా చూడాలన్నారు. అనంతరం ప్రసవానికి ముందు, ప్రసవానంతరం గర్భిణులకు అం దించాల్సిన వైద్యసేవల గురించి స్త్రీ వైద్య నిపుణులు కవిత, నిర్మల ఏఎన్‌ఎం, ఆశాలకు వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు యశోద, శిల్పిని, పిల్లల వైద్యులు కరణ్‌రెడ్డి, మోహన్, ఇమ్యూనైజేషన్ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి
రాజాపేట: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాజాపేట మండలం బూరుగుపల్లిలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభా రతి దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతీ దరఖాస్తును భూభారతిలో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగవేణి, తహసీల్ధార్ అనిత, ఎంపీవో కిషన్, వెలుగు ఏపీఎం నర్సింహ, హౌసింగ్ ఏఈ కోటయ్య, పంచాయతీ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.