తుది జాబితా సిద్ధం
ABN , Publish Date - May 24 , 2025 | 12:21 AM
పేదవారి సొంతింటి కల నెరవేరనుం ది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాల్లో భాగంగా ఆరు గ్యారెంటీల్లో ఒకటైన అభయ హస్తం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆ కల సాకారం కానుంది. పథ కం నియమాలను అనుసరించి అర్హులై న లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావడంతో తుది జాబితాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది.

ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పూర్తి
జిల్లాలో ఇప్పటి వరకు 8,953 ఇళ్లు మంజూరు
రెండోవిడతలో 8,191 ఇళ్లు మంజూరు
త్వరలోనే ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత
పెరిగిన సిమెంట్, ఇతర వస్తువుల ధరలపై లబ్ధిదారుల్లో ఆందోళన
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): పేదవారి సొంతింటి కల నెరవేరనుం ది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాల్లో భాగంగా ఆరు గ్యారెంటీల్లో ఒకటైన అభయ హస్తం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆ కల సాకారం కానుంది. పథ కం నియమాలను అనుసరించి అర్హులై న లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావడంతో తుది జాబితాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. మొదటి, రెండో విడుతల కింద మొత్తం 8,191 ఇళ్లను మం జూరు చేసింది. అయితే ప్రస్తుతం పెరిగి న సిమెంట్, స్టీల్ ధరలు లబ్ధిదారులకు తలకు మించిన భారంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లులేని పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా అభయాస్తం కింద 100శాతం సబ్సిడీతో ఇళ్లను నిర్మించుకునేందుకు రూ.5లక్షలు మం జూరు చేస్తుంది. ప్రభుత్వం మొదట విడతగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటి స్థలం ఉన్న వారిని తొలుత ఎంపిక చేసింది. అయితే వీటిని మొదటగా కొన్ని గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుని నిర్మాణాలు చేపట్టింది. జిల్లాలో మొదటి విడతలో మొత్తం 762 ఇళ్లు, రెండోవిడతలో 8,191 ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి, నిర్మాణాలు ప్రారంభించింది. పలు గ్రామాల్లో వివిధ స్థాయిల్లో ఇళ్ల నిర్మాణా లు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ప్రభుత్వం రెండో విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల ను మంజూరు చేసింది. జిల్లా యంత్రాంగం గ్రామసభ ల్లో ఇందిరమ్మ కమిటీలు, అధికారులు సర్వేల అనంత రం లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేశారు. ఈ పథకం కింద ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 8,953 మంది లబ్ధిదారులను ఎంపికచేసింది. వీటిలో కలెక్టర్‌తోపాటు ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తెలపడంతో లబ్ధిదారుల తుది జాబితా ప్రకటించింది. మంజూరైన ప్రొసీడింగ్ పత్రాలు ఆయా మండలాలవారీగా లబ్ధిదారులకు అందించనున్నారు. అన్ని మండలాల్లోనూ అధికారులు ఇందిరమ్మ ప్రొసీడింగ్ పత్రాలను జనరేట్ చేస్తున్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లోనూ నిర్మాణాలు ప్రారంభించేందుకు జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటుంది.
మొదటి విడతలో మంజూరైన ఇళ్లు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కిం ద మొదటి విడతలో జిల్లాకు పైలెట్ ప్రాజెక్టు కింద 762 వరకు ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారు లు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయి. వీటిలో భువనగిరి నియోజకవర్గంలో మొత్తం 258 ఇళ్లు మంజూరు కాగా..., భువనగిరి మండలంలో 116 ఇళ్లు, బీబీనగర్‌లో 53 ఇళ్లు, భూదాన్‌పోచంపల్లిలో 67 ఇళ్లు మంజూరయ్యా యి. ఆలేరు నియోజకవర్గంలో మొత్తం 247 ఇళ్లు మం జూరు కాగా.. అలేరు మండలంలో 47ఇళ్లు, ఆత్మకూరు (ఎం)లో 31 ఇళ్లు, బొమ్మలరామారంలో 18 ఇళ్లు, గుం డాలలో 26 ఇళ్లు, మోటకొండూరులో 11 ఇళ్లు, రాజపేటలో 34 ఇళ్లు, తుర్కపల్లిలో 17 ఇళ్లు, యాదగిరిగుట్ట లో 63 ఇళ్లు మంజూరయ్యాయి. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో 41 ఇళ్లు, సంస్థాన్‌నారాయణపురంలో 24 ఇళ్లు, తుంగతుర్తి నియోజకవర్గంలో అడ్డగూడూరులో 59 ఇళ్లు, నకిరేకల్ నియోజకవర్గంలో ని నకిరేకల్ మండలంలో 87 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ ఇళ్ల పనులు అన్ని చోట్ల ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల పునాదుల దశలోనే ఉండగా, మరికొన్ని చోట్ల లెంటల్ లెవల్ దశకు చేరుకున్నాయి.
ఆర్థిక పరిస్థితిపై లబ్ధిదారుల ఆలోచనలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిమెంట్ ధరలు ఇటీవల పెరగడంతో ఆర్థికభారం పడనుంది. గత నెల రోజుల్లో సిమెంట్ ధరలు ఒక్కో బస్తాకు రూ.50నుంచి రూ.70వరకు వివిధ కంపెనీలు పెంచాయి. దీంతోపాటు నిర్మాణపరంగా వాడే వస్తువుల ధరలు కూడా పెరిగాయి. దీంతో లబ్ధిదారులు ఆర్థిక స్థితిగతులపై ఆలోచనల్లో పడ్డారు. పాత ఇంటిని తొలగిస్తే నివాసం దొరకడం కష్టంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదల చేతిలో నగదు లేకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు. తక్కువ స్థలం విస్తీర్ణం, బిల్లుల చెల్లింపు జాప్యం, రూ.5లక్షలు సరిపోవన్న భావనతోపాటు ఆర్థిక స్థోమత ఇతరత్రా కారణాలతో లబ్ధిదారులు వెనుకాడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకుంటేనే బిల్లులు మంజూరు చేస్తామని ప్రకటించింది. జిల్లాలో పలుచోట్ల నిబంధనలు ఉల్లంఘించిన లబ్ధిదారులకు బిల్లులు కూడా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారుల్లో ఆయోమయం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి పెంకుటిళ్లు ఉన్నాయి. ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇళ్లను తొలగించి నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకుంటేనే మంజూరు కావడంతో కొంతమంది ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకునేందుకు ఆసక్తి చూపించడంలేదు. క్షేత్రస్థాయిలో అధికారులు అవగాహన కల్పించినప్పటికీ, కొంతమంది లబ్ధిదారులు నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. ఇళ్లను భారీగా నిర్మించుకుంటే ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాయంత్రాంగం మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలుచేపట్టాలని సూచిస్తుంది. రెండోవిడతలో.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండో విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయి. మంజూరు పత్రాలు జారీ కాగానే, నిర్మా ణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా మండలాలవారీగా లబ్ధిదారుల ఎంపిక తుదిజాబితాను అధికారులకు అందజేసింది.
ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి : విజయ్‌సింగ్, హౌసింగ్ పీడీ
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంకింద మొదటి దశలో మంజూరైన 762 ఇళ్ల నిర్మాణాలు ముగ్గులుపోశారు. పలుచోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పునాదులు పూర్తి చేసిన వారికి బిల్లులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండో విడతలో మొత్తం ఇప్పటివరకు 2,880 ఇళ్లు మంజూరు కాగా, లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జనరేట్ అవుతున్నాయి. రెండు మూడు రోజుల్లో పత్రాలు అందజేసిన అనంతరం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించనున్నాం.
మంజూరైన ఇళ్లు
భువనగిరి నియోజకవర్గం
మండలం ఇళ్లు
భువనగిరి 557
బీబీనగర్ 626
భూదాన్‌పోచంపల్లి 425
వలిగొండ 586
భువనగిరి
మునిసిపాలిటీ 491
పోచంపల్లి
మునిసిపాలిటీ 195
ఆలేరు నియోజకవర్గం
అలేరు 288
ఆత్మకూరు 301
బొమ్మలరామారం 427
గుండాల 354
మోటకొండూరు 265
రాజపేట 437
తుర్కపల్లి 276
యాదగిరిగుట్ట 348
యాదగిరిగుట్ట
మునిసిపాలిటీ 134
ఆలేరు
మునిసిపాలిటీ 160
మునుగోడు నియోజకవర్గం
చౌటుప్పల్ 500
నారాయణపురం 459
తుంగతుర్తి నియోజకవర్గం
అడ్డగూడూరు 163
మోత్కురు 101
మోత్కురు
మునిసిపాలిటీ 154
నకిరేకల్ నియోజకవర్గం
రామన్నపేట 602