సాగుకు సన్నద్ధం
ABN , Publish Date - May 30 , 2025 | 11:58 PM
రోళ్లు పగిలే ఎండలు కాయాల్సిన రోహిణీ కారె ్తకు ముందే అనూహ్యంగా తొలకరి వాన పలకరించడంతో రైతులు మురిసిపోయారు. నైరుతి పవనాలు ముందస్తుగానే ప్రవేశించడంతో ముందస్తు వానలు పడుతున్నాయి.
ఆరుతడి పంటల సాగుకు దుక్కులు సిద్ధం చేసిన రైతులు
మృగశిరలో వాన పడగానే విత్తనాలు వేసేలా ప్లాన్
విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచిన ప్రభుత్వం
ఎలాంటి కొరత రానివ్వబోమని స్పష్టతనిస్తోన్న వ్యవసాయ శాఖ
(ఆంఽధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): రోళ్లు పగిలే ఎండలు కాయాల్సిన రోహిణీ కారె ్తకు ముందే అనూహ్యంగా తొలకరి వాన పలకరించడంతో రైతులు మురిసిపోయారు. నైరుతి పవనాలు ముందస్తుగానే ప్రవేశించడంతో ముందస్తు వానలు పడుతున్నాయి. వాతావరణం చల్లబడి ప్రతిరోజూ చిరుజల్లులు కురుస్తుండడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆరుతడి పంటల సాగుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. రైతులు సంప్రదాయకంగా విశ్వసించే మృగశిర కార్తె సైతం జూన్ 8న ప్రవేశించనుండడం, ఇప్పటికే వానలు బలంగా కురుస్తుండడంతో ఈ వారం తర్వాత ఆరుతడి పంటలకు విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మెట్టప్రాంతాల్లో ప్రధానంగా పత్తి, కంది, జొన్న సాగుచేసే భూములను విత్తనాలు వేయడానికి అనుకూలంగా దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. మరోవైపున విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 7.94లక్షల ఎకరాల్లో పత్తి, 27వేల ఎకరాల్లో కంది, 37వేల ఎకరాల్లో జొన్న, పెసర, సజ్జ వంటి ఇతర ఆరుతడి పంటలు సా గు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వానాకా లం సీజన్ ముందస్తుగానే మొదలవుతుండడంతో వ్యవసాయాధికారులు సైతం అప్రమత్తమయ్యారు. జిల్లాలో పత్తి సాగు నిమిత్తం ప్రభుత్వం ధ్రువీకరించిన 20 కంపెనీలకు చెందిన 19.75 లక్షల పత్తి విత్త న ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్ 450 గ్రాములు) అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా 2,254 క్వింటాళ్ల కంది విత్తనాలు, మరో 3వేల క్వింటాళ్ల ఇతర విత్తనాలు అందుబాటు లో ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా విత్తనాల కొరత లేదని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. పత్తి సాగుచేసే రైతులు సైతం ఇప్పటికే స్థానిక డీలర్ల వద్ద, ఏపీలోని గుంటూరు, మాచర్ల ప్రాంతాల్లోని డీలర్ల నుంచి అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్, గద్వాల ప్రాంతాలలోని డీలర్ల నుంచి విత్తనాలు కొనితెచ్చుకొని సిద్ధంగా పెట్టుకున్నారు. జూన్ నెలకు సంబంధించి అవసరమైన 57,569 మెట్రిక్‌టన్ను ల యూరియా, 52,860 మెట్రిక్ టన్నుల కాంపె ్లక్స్ ఎరువులు, 14,317 మెట్రిక్‌టన్నుల ఇతర ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయా ధికారులు తెలిపారు. వచ్చే ఆరునెలలకు అవసరమైన ఎరువులు బఫర్ స్టాక్‌లో ఉన్నాయని రైతులెవరూ ఎరువుల కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.
బోరు బావుల కింద నారుమళ్లు సిద్ధం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 12.35 లక్షల ఎకరాల వరి సాగవుతుందని అంచనావేశారు. ఇందులో నాగార్జునసాగర్, మూసీ, కాళేశ్వ రం, ఎస్‌ఆర్‌ఎస్పీ రెండోదశ కింద దాదాపు 8లక్ష ల ఎకరాలు సాగయితే, మిగిలిన 4.35లక్షల ఎకరాలు బోరుబావుల కింద, చెరువుల కింద సాగవుతుంది. ప్రాజెక్టుల కింద ఆగస్టు వరకు సాగు కు సమయం ఉండగా, బోరుబావులకింద సాగు చేసే రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో వరిసాగుకు 2.70లక్షల క్వింటాళ్ల వరివిత్తనాలు అవసరమవుతాయని, ప్రస్తుతం 66వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అం దుబాటులో ఉన్నాయని, రైతులకు కొరత లేకుం డా వరివిత్తనాలందించేందుకు ఏర్పాట్లు చేశామని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.