Share News

‘ప్రజావాణి’ దరఖాస్తులకు పరిష్కారం చూపాలి

ABN , Publish Date - May 27 , 2025 | 12:25 AM

‘ప్రజావాణి’లో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఆయనకు ఫిర్యాదులు అందజేశారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులకు పరిష్కారం చూపాలి

కలెక్టర్‌ ఎం.హనుమంతరావు

భువనగిరి కలెక్టరేట్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజావాణి’లో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఆయనకు ఫిర్యాదులు అందజేశారు. మొత్తం 40 దరఖాస్తులు రాగా, వీటిని కలెక్టర్‌ పరిశీలించి ప్రజలు ఇచ్చిన దరఖాస్తులపై స్పందించి న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉంచవద్దని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) జీ.వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జయశ్రీ, డీఆర్‌డీవో టీ.నాగిరెడ్డి, డీపీవో సునంద, ఏవో జగన్మోహన్‌ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం ఇచ్చిన భూములను విక్రయించిన, కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వలిగొండ మండలం అప్పారెడ్డిపల్లి గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

తుర్కపల్లి మండలం ముల్కలపల్లి శివారులో తనకు ఉన్న 3ఎకరాల భూమికి పట్టాదారు పాస్‌బుక్‌ జారీ చేయాలని బానోతు శ్రీను కోరాడు.

జిల్లా కేంద్రంలోని ‘బాల సదనం’ పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బాలల పరిరక్షణ వేదిక నేత కొడారి వెంకటేశ్‌ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

మోత్కూరు: మోత్కూరు మునిసిపాలిటీలో చెరువులోకి వరద నీరు వెళ్లకుండా వెంచర్‌ నిర్మాణం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు బయ్యని రాజు, పోచం సోమయ్య, ఎస్‌డి.జలాల్‌, అంబోజు రాంమూర్తి, అన్నెపు వెంకట్‌, గొలుసుల యాదగిరి, నిలిగొండ కృష్ణ, ఓ.సత్యనాథ్‌, తదితరులు విజ్ఞప్తిచేశారు.

నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా

‘రాజీవ్‌ యువ వికాసం’ నిరుద్యోగ యువత కు ఆర్థిక భరోసా కల్పిస్తుందని, యూనిట్ల ఎం పికలో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ ఎం. హనుమంతరావు అన్నారు. సోమవారం కలెక్టరే ట్‌ నుంచి అధికారులతో నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీ సీ, మైనారిటీ నిరుద్యోగుల కుటుంబాలు రాజీ వ్‌యువ వికాసం పథకంతో ఆర్థిక ప్రగతి సా ధించేలా యూనిట్లను ఎంపిక చేయాలన్నారు. లబ్ధిదారులకు యూనిట్ల ఎంపికపై అవగాహన కల్పించి మంజూరులో సమన్యాయం పాటించాలన్నారు. సమావేశంలో ఎస్సీ, బీసీ సంక్షేమాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 12:25 AM