‘ప్రజావాణి’ దరఖాస్తులను పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:29 AM
‘ప్రజావాణి’ దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వేగంగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించి న ‘ప్రజావాణి’లో వివిధ ప్రాంతాల వచ్చిన ప్రజల నుం చి 48 వినతులు, ఫిర్యాదులు తీసుకొని మాట్లాడారు.
కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి(కలెక్టరేట్), జూలై 7 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజావాణి’ దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వేగంగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించి న ‘ప్రజావాణి’లో వివిధ ప్రాంతాల వచ్చిన ప్రజల నుం చి 48 వినతులు, ఫిర్యాదులు తీసుకొని మాట్లాడారు. ఫిర్యాదు ల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు చెందిన దరఖాస్తులు 34 ఉన్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, బడిబాట, వన మహోత్సవం,ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వన మహోత్సవంలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మహిళలకు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్ట ర్ జీ.వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎన్.శోభారాణి, డీఆర్డీవో టీ.నాగిరెడ్డి, కలెక్టరేట్ ఏవో జగన్‌మోహన్‌ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
వెటర్నరీవైద్యులు సమయపాలన పాటించకపోవడం తో సీజనల్ వ్యాధులబారిన పడిన జీవాలకు వైద్యం అందడంలేదని,వెంటనే చర్యలు తీసుకోవాలని జీఎంపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దయా ల నర్సిం హ, మద్దెపురం రాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఇస్తామ ని చేసిన హామీని అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నర్సింహ వినతిపత్రం అందజేశారు.
వీవోఏ లంచంగా తీసుకున్నట్టు నిరూపణ అయినా ఆమె స్థానంలో కొత్తవారిని నియమించలేదని, వెంటనే కొత్తగా వీవోఏను నియమించాలని యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన మహిళలు వినతిపత్రం అందజేశారు.
(ఆంధ్రజ్యోతి, భూదాన్‌పోచంపల్లి): భూదాన్‌పోచంపల్లి మండలం కప్రాయిపల్లిలో సర్వే నెంబరు 169, 170 పట్టాభూమి పక్కన ఉన్న గ్రామకంఠం భూమి ని ఆక్రమించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన సుంకరి రవి, సుంకరి కృష్ణస్వామి ఫిర్యాదు చేశారు.
(ఆంధ్రజ్యోతి, యాదగిరిగుట్ట రూరల్): యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూర్ గ్రామంలో మురుగు కాల్వ సమస్య తీవ్రంగా ఉందని గ్రామానికి చెందిన పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, వెంటనే సమస్యను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి ఆరె రాజును ఆదేశించారు.
విరివిగా మొక్కలు నాటాలి : కలెక్టర్
(ఆంధ్రజ్యోతి, భువనగిరి రూరల్): ప్రతీ ఒక్కరు విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా సోమవారం భువనగిరి మండలం అనంతారం శివారులోని జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయ ఆవరణలో కలెక్టర్ మొక్క నాటి నీరుపోశారు. ఆయన వెంట డీఆర్డీవో నాగిరెడ్డి, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ మందడి ఉపేందర్‌రెడ్డి, అదనపు డీఆర్డీవో సురేశ్, ఎంపీడీవో సీహెచ్.శ్రీనివా్‌స, ఎంపీవో దినకర్, ఏపీవో బాలస్వామి, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్‌రావు ఉన్నారు.