Share News

‘ప్రజావాణి’ దరఖాస్తులను పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 01 , 2025 | 01:08 AM

‘ప్రజావాణి’కి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా వేగవంతంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో 86 దరఖాస్తులు తీసుకొని మాట్లాడారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులను పరిష్కరించాలి

అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు

భువనగిరి (కలెక్టరేట్‌), జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజావాణి’కి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా వేగవంతంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో 86 దరఖాస్తులు తీసుకొని మాట్లాడారు. అర్జీలకు ప్రాధాన్యం ఇచ్చి వేగవంతంగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తుల్లో అత్యధికంగా రెవెన్యూశాఖకు చెందినవి 54 వరకు ఉన్నాయి. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జయశ్రీ, డీఆర్డీవో నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చెరువు శిఖంలో ఉన్న వ్యవసాయ బోరు నీటిని సొంతానికి వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట మండలం బాహుపేటకు చెందిన రైతులు ఆరే సిద్దయ్య, జహంగీర్‌,సాయిలు, మల్లేష్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఖాళీ స్ధలానికి ఇంటి నంబర్‌ కేటాయించి నిర్మాణాలకు అక్రమ అనుమతులు ఇచ్చిన పంచాయతీ కార్యదర్శిపై, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీబీనగర్‌ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన కందుల శ్రీనివా్‌సరావు ఫిర్యాదు చేశారు. 8 చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 15 అడుగుల మేర మట్టి పోసినవారి పై చర్యలు తీసుకోవాలని బొమ్మలరామారం మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన రైతులు రాఘవేందర్‌రెడ్డి, వీర ప్రసాద్‌రెడ్డి, ప్రేమలత ఫిర్యాదు చేశారు.

తనకు తెలియకుండా, అనుమతి లేకుండా, తన పేరున 4.30ఎకరాల భూమిని కుమారుడు పట్టా చేసుకున్నాడని, దాన్ని రద్దు చేయాలని గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన కందాడి శాంతమ్మ ఫిర్యాదు చేసింది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవినీతిని అరికట్టి, ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు.

(ఆంధ్రజ్యోతి, వలిగొండ): ప్రొద్దుటూరు, ఏదుళ్లాగూడెం గ్రామాలకు బస్సును పునరుద్ధరించాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల నాగరాజు ఆధ్వర్యంలో నరేందర్‌, సాయి, వినయ్‌, తదితరులు ‘ప్రజావాణి’లో వినతిపత్రం అందజేశారు.

Updated Date - Jul 01 , 2025 | 01:08 AM