కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:23 AM
కాళేశ్వ రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి హరీ్‌షరావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం హైదరాబాద్ లో ఆయన ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను భువనగిరిలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్‌పై స్థానిక నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.
పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌లో మాజీ మంత్రి హరీ్‌షరావు
భువనగిరిటౌన్, భువనగిరి (కలెక్టరేట్), ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వ రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి హరీ్‌షరావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం హైదరాబాద్ లో ఆయన ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను భువనగిరిలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్‌పై స్థానిక నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకత, కేసీఆర్ చిత్తశుద్ధి, నాటి ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ, ప్రాజెక్టు పూర్తితో సాధించి న ఫలితాలు, కేసీఆర్‌పై నేటి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు, కమిషన్ నివేదిక.. తప్పుల తడక అంటూ వివరించిన అంశాల ను తిలకించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైనదైతే గోదావరి జలాల తో మూసీ నదిని నింపుతామని ఎలా ప్రకటించారో సీఎం సమాధానమివ్వాలన్నారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ చైర్మన్లు ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, కొలుపుల అమరేందర్, ఎనబోయిన ఆంజనేయులు, పెంట నర్సింహ, నువ్వుల ప్రసన్న, కేశవపట్నం రమేష్, బీఆర్‌ఎస్ పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివా్‌సరెడ్డి, నీలం ఓంప్రకాష్, ఇట్టబోయిన గోపాల్, తదితరులు పాల్గొన్నారు. కాగా, పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనారోగ్యం కారణంతో దత్తప్పగూడెంలో వీక్షించారు.