Share News

బావిలో పడిన ఆవును రక్షించిన పోలీసులు

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:26 AM

బావిలో పడిన ఆవును నల్లగొండ జిల్లా కేంద్రంలోని వనటౌన పోలీసులు రక్షించారు. సీఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఎ్‌ఫవో బృందం రిస్క్‌ ఆపరేషన నిర్వహించింది.

బావిలో పడిన ఆవును రక్షించిన పోలీసులు
పోలీసులు, తాళ్ల సహాయంతో బయటకు తీసిన ఆవు

నల్లగొండ టౌన, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : బావిలో పడిన ఆవును నల్లగొండ జిల్లా కేంద్రంలోని వనటౌన పోలీసులు రక్షించారు. సీఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఎ్‌ఫవో బృందం రిస్క్‌ ఆపరేషన నిర్వహించింది. బుధవారం ఉదయం పట్టణంలోని బొట్టుగూడ ప్రాంతంలో విటల్‌ ఆసుపత్రి పక్కన ఉన్న పాతబావిలో ఓ ఆవు జారి పడింది. ఈ విషయం సామాజిక మాద్యమాల్లో రావడాన్ని గమనించిన వనటౌన సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి వెంటనే స్పందించారు. సీఐ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది, ఎస్‌ఎ్‌ఫవో సత్యనారాయణరెడ్డి ప్రత్యేక బృందంతో కలిసి ఆవును రక్షించారు. ఎక్స్‌కవేటర్‌ సాయంతో ఆవుకు తాళ్లు కట్టి జాగ్రత్తగా బయటకు తీసి సురక్షిత ప్రదేశానికి తరలించారు.

Updated Date - Jul 03 , 2025 | 12:26 AM