మహిళా సమస్యలపై పోరాటాలకు ప్రణాళికలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:42 PM
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి,, పోరాటాలకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ కోరారు.
చౌటుప్పల్ టౌన, అక్టోబరు 28( ఆంధ్రజ్యోతి): మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి,, పోరాటాలకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ కోరారు. చౌటుప్పల్ పట్టణంలో మంగళవారం ఐద్వా జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ మహిళలు, బాలికలపై యథేచ్ఛగా హత్యాచారాలు జరుగుతున్నాయని, సమాజంలో రాక్షస ప్రవృత్తి రోజు రోజుకూ పెరిగి పోతోందని ఆమె అన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యాన్ని కల్పించి ఆడపిల్లలకు అండగా ఉంటామని ఆమె తెలిపారు. సమావేశంలో జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి, జిల్లా సహాయ కార్యదర్శి మల్లేపల్లి లలిత పాల్గొన్నారు.