అలుగునీటి కాల్వ ఏర్పాటుకు ప్రణాళిక
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:20 AM
: చౌటుప్పల్ పట్టణంలోని ఊర చెరువు అలుగు నీరు సజావుగా ముందుకు వెళ్లేందుకు గాను శాశ్వత పరిష్కారం కోసం ఖచ్చితమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు మునిసిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్‌రెడ్డి, ఐబీ ఎస్‌ఈ జి.శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.
చౌటుప్పల్ టౌన, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్ పట్టణంలోని ఊర చెరువు అలుగు నీరు సజావుగా ముందుకు వెళ్లేందుకు గాను శాశ్వత పరిష్కారం కోసం ఖచ్చితమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు మునిసిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామ్‌రెడ్డి, ఐబీ ఎస్‌ఈ జి.శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో గురువారం కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి, ఐబీ ఎస్‌ఇ జి. శ్రీనివాస్ రెడ్డి, ఈఈ మనోహర్, మునిసిపల్ ఏఈఈ నితీ్‌షకుమార్‌రెడ్డి పట్టణంలో పర్యటించారు. గతంలో చెరువు నిండి అలుగు పోసిన సందర్భాల్లో పట్టణంలోని పలు కాలనీలు నీట మునగడం, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడం, ఇళ్లతో పాటు బస్ స్టేషన, పోలీస్ లలోకి వరద నీరు చేరడం వంటి సంఘటనలను అధికారుల బృందం పరిగణలోకి తీసుకుని పరిశీలన చేసింది. చెరువు అలుగు నుంచి వరద నీరు ప్రవహించే ఆర్టీసీ బస్ స్టేషన, హ్యాండ్లూమ్ మార్కెట్, గాంధీ పార్క్, పోలీస్ స్టేషన, రామ్‌నగర్, వలిగొండ రోడ్డు కల్వర్టు, జయభూమి కాలనీ, అమ్మా నాన్న ఆశ్రమం మీదుగా తాళ్ల సింగారం సమీపంలోని దివి చెరువు వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున అధికారులు నడుచుకుంటు వెళ్లి వరద ప్రవాహ ప్రాంతాలను పరిశీలించారు. అలుగు నీటితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు సమీపంలోని కాలనీల్లోకి వెళ్లకుండా నేరుగా దిగువకు ప్రవహించేందుకు అనువుగా కాల్వ నిర్మాణం చేయడం, వరద కాల్వ, బఫర్ జోనలలో అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా పకడ్బందీగా తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలపై అధికారులు సమీక్షించారు. అత్యధిక వర్షపాత నమోదు, చెరువు నిండడం, కాలనీలు మునగడం, ప్రజలకు ఇబ్బందులు జరగడం వంటి అనేక పరిణామాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన సూచనలను పరిగణలోకి తీసుకున్న అధికారులు లోతుగా అధ్యయనం చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబందించి అంచనాలను రూపొందించి సమగ్రమైన నివేదికను ఎమ్మెల్యేకు అందజేస్తామని ఎస్‌ఈ శ్రీనివా్‌సరెడ్డి, కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు.