Share News

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కల్పించాలి

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:14 AM

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్‌ ఫిల్టర్‌ ను ప్రారంభించి మాట్లాడారు.

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కల్పించాలి

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి

యాదగిరిగుట్ట రూరల్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యో తి): ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్‌ ఫిల్టర్‌ ను ప్రారంభించి మాట్లాడారు. యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకునే భక్తులు, స్థానిక ప్రజలకు ఇబ్బందుల్లేకుండా పీహెచ్‌సీకి మరో మెడికల్‌ ఆఫీసర్‌ను నియమించడానికి కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, సన్నబియ్యం, రైతు భరోసా, రుణమాఫీ, గృహలక్ష్మీ, మహాలక్ష్మీ పథకాలను అమలుచేస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ చైర్‌పర్సన్‌ అయినా ల చైతన్యరెడ్డి, కాంగ్రెస్‌ మహిళా జిల్లా అధ్యక్షురా లు నీలం పద్మవెంకటస్వామి, డీఎంహెచ్‌వో మనోహర్‌, కాంగ్రెస్‌ మండల, పట్టణ అధ్యక్షులు మంగ సత్యనారాయణ, బందారపు భిక్షపతిగౌడ్‌, యాదగిరిగుట్ట మాజీ కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణిభరత్‌గౌడ్‌, ముక్కెర్ల మల్లేష్‌, ఎరుకల హేమేందర్‌గౌడ్‌, భువనగిరి మార్కెట్‌ కమిటి మాజీ చైర్మన్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, నాయకులు పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం): ప్రజాపాలనలో మండల అభివృద్ధి విషయంపై భువనగిరి ఎంపీ చామలకిరణ్‌కుమార్‌రెడ్డి స్థానిక నాయకులను అడిగితెలుసుకున్నారు.ఆదివారం గుండాల మండల పర్యటనకు ప్రభుత్వ విప్‌ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి వెళ్తూ ఆత్మకూరులో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయని అడిగారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, కె.అనంతరెడ్డి ఎం.సిద్ధులు జి.శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

24గంటల వైద్య సదుపాయం కల్పిస్తాం

గుండాల: గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24గంటల వైద్య సదుపాయాన్ని కల్పిస్తామని ప్రభుత్వ విప్‌ బీర్లఅయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించి మాట్లాడారు. గుండాల మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ద్యాప కృష్ణారెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఏలూరి రాంరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగాల భిక్షం పాల్గొన్నారు.

అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

బొమ్మలరామారం: గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలని బీర్ల అయిలయ్య అన్నారు. మండలంలోని కంచలతండాలో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించి మాట్లాడారు. ప్రజల సంక్షేమం దిశగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో మదర్‌ డెయిరీ చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, భువనగిరి మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ వైసు రాజే్‌షపైలెట్‌, పార్టీ మండల అధ్యక్షుడు సింగిర్తి మల్లేశం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీరాముల నాయక్‌, మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీహరినాయక్‌, ఏరువ హేమంత్‌రెడ్డి, మైలారం ఈశ్వర్‌, మహిళా కాంగ్రెస్‌ మండల అధ్యక్షురాలు సునీత నాయక్‌, దేవస్థాన కమిటీ చైర్మన్‌ పండుగ రాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 12:14 AM