ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:40 AM
వాతావరణ శాఖ రానున్న 72 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలన్నారు.
అధిక వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
భువనగిరి (కలెక్టరేట్), ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వాతావరణ శాఖ రానున్న 72 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలన్నారు. రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యం లో ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలను అప్రమ త్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సహాయక చర్యలకు నిధులను అందిస్తామని ఉద్యోగులు, సిబ్బందికి మూ డు రోజులు సెలవులు రద్దు చేయాలన్నారు. పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని, ఐటీ ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం నిర్వహించాలన్నారు. ఎక్క డ ఏంజరిగినా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందే లా చర్యలు తీసుకొని ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేట ర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఆకస్మిక వరదలు వస్తే హెలికాప్టర్లను అందుబాటులో ఉంచాలన్నారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంశ్ యాదవ్, అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
08685-293312
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం నెం
వాతావరణ శాఖ హెచ్చరికలు, ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సీఎం కాన్ఫరెన్స్ అనంతరం ఆయన కీలక విభాగాల అధికారులతో సమావేశమై పలు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెం: 08685- 293312 ఏర్పాటు చేశామన్నారు.