పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:28 AM
వేములపల్లి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని చిత్రపరక వాగు, లక్ష్మీదేవిగూడెం బందానికి వరద పోటెత్తింది.
వేములపల్లి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని చిత్రపరక వాగు, లక్ష్మీదేవిగూడెం బందానికి వరద పోటెత్తింది. ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులకు గురయ్యారు. చిత్రపరక వాగుకు పైన ఉన్న గొలుసుకట్టు చెరువులకు వరద వచ్చి చేరుతుండడంతో శెట్టిపాలెం శివారులో చిత్రపరక వాగు బ్రిడ్జి వెంట గల లోతట్టు వరి పొలాలు నీట మునిగాయి. అలాగేర ఆమనగల్లు చెరువుకు మూసీ కాల్వ నుంచి వరద వచ్చి చేరడంతో చెరువు అలుగుపోస్తుంది. దీంతో లక్ష్మీదేవిగూడెం గ్రామ శివారులోని బందానికి వరద వచ్చి చేరుతుండడంతో లోలెవల్ వంతెన నీట మునిగింది. భీమారం- సూర్యాపేట రహదారిపై రాకపోకలు కొనసాగించే వాహనదారుల ఇబ్బందులకు గురవుతున్నారు.
ఫ మాడ్గులపల్లి : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాలేరువాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. ఆగామోత్కూర్, చిరుమర్తి, బొమ్మకల్, కల్వలపాలెం చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భూగర్భజలాలు పెరగడంతోపాటు వ్యవసాయ పంటలకు అనుకూలంగా మారిందని రైతులు ఆశాజనకంగా ఉన్నారు.