వైభవంగా ఊంజల్ సేవోత్సవం
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:42 PM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో శుక్రవారం స్వామివారికి స్వర్ణపుష్పార్చన, అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం వైభవంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట, జూన 27 (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో శుక్రవారం స్వామివారికి స్వర్ణపుష్పార్చన, అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రాకార మండపంలో హోమం, నిత్యకల్యాణం సంప్రదాయరీతిలో కొనసాగాయి. సాయంత్రం ప్రధానాలయంలో కొలువుదీరిన ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవోత్సవం నేత్రపర్వంగా సాగింది. పాతగుట్ట ఆలయంలో నిత్య పూజలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి. ప్రధాన ఆలయానికి అనుబంధ శివాలయంలో చండీహోమం నిర్వహించారు. కాగా ఆలయ ఖజానాకు వివిధ విభాగాల నుంచి రూ. 15,54,417 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎస్.వెంకట్రావు తెలిపారు.