సర్టిఫికెట్లు బకాయిలు చెల్లిస్తేనే..
ABN , Publish Date - Jun 19 , 2025 | 11:27 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల వి డుదలలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం కారణం గా ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెగేసి చెబుతున్న ప్రైవేట్‌కళాశాలల యాజమాన్యాలు
ఇంటర్ విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పలు విడుదల చేయని ప్రభుత్వం
అయోమయంలో విద్యార్థులు
భువనగిరి టౌన, జూన 18 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల వి డుదలలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం కారణం గా ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయిలు రాకపోవడంతో ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ప్రైవేట్ యాజమాన్యాలు తెగేసి చెబుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు తమకు చెల్లిస్తే స రిపోతుందని, ప్రైవేట్ ఇంటర్ కళాశాల యాజమాన్యాలు ఇంటర్ మొదటి సంవత్సరంలో వి ద్యార్థులను చేర్చుకున్నాయి. కానీ, మూడేళ్లుగా ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోతుండటంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులై కళాశాలలను వీడుతున్న విద్యార్థులకు ఫీజు మొత్తం చెల్లిస్తేనే మెమో, టీసీ తదితర సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యాలు స్పష్టం చేస్తుండటంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం ఆలస్యంగా నిధులు విడుదల చేసినా, విద్యార్థుల బ్యాంక్ ఖాతా ల్లోనే జమవుతాయని, ప్రస్తుతం ఫీజు చెల్లిస్తే నే ఒరిజినల్ సర్టిఫికెట్టు ఇస్తామని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో విద్యార్థు ల తల్లిదండ్రులు ప్రైవేట్ కళాశాలలతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇదే తరహా పరిస్థితి ఉ మ్మడి జిల్లాలోని సుమారు అన్ని ప్రైవేట్ కళాశాలల్లో నెలకొంది. ద్వితీయ సంవత్సరంలో 26,040 మందికి 18,699 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో సుమారు 10వేల మందికి పైగా ఉమ్మడి జిల్లాలోని సుమారు 125 ప్రైవేట్ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్నారు. వీరిలో మెజార్టీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పలకు అర్హులుగా ఉన్నారు.
రూ.40 కోట్ల బకాయిలు
ఉమ్మడి జిల్లాలో సుమారు 125 ఇంటర్ ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. అర్హులైన విద్యార్థులకు ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ. 2 వే లు, ఉపకార వేతనాలుగా రూ.5వేలు మొ త్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు రూ. 15వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ రెండు విద్యార్థుల ఖాతాల్లోనే జమవుతాయి. కానీ, బ్యాంక్ పాస్‌పుస్తకాలు మాత్రం యాజమాన్యాల వద్ద ఉంటాయి. ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ జమ అయిన వెంటనే యాజమాన్యాలు పాస్‌పుస్తకాలను ఇస్తారు. విద్యార్థులు బ్యాంకుకు వెళ్లి ఆ మొత్తాన్ని డ్రా చేసి కళాశాలలో పాస్‌పుస్తకాలతో సహా తిరిగి ఇవ్వాలని పరస్పర ఒప్పందంతో అడ్మిషన్లు జరుగుతాయి. అయితే మూడేళ్లుగా ప్రభుత్వం నిధులను మం జూరు చేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలకు సుమారు రూ.40కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వీటిలో సగం ప్రథమ, మిగతా సగం ద్వితీయ సంవత్సరం విద్యార్థుల బకాయిలు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఇంకో ఏడాది కళాశాలలోనే ఉంటుండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కళాశాలలను వీడుతున్నారు. వీరిలో ఫెయిల్ అయిన వారు ఇంటికి, ఇతర పనులకు పరిమితమవుతూ సర్టిఫికెట్లను తీసుకొని పరిస్థితి. కానీ, ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉన్నత విద్యలో చేరేందుకు సర్టిఫికెట్లు తప్పనిసరి. దీంతో అనుకున్నట్టుగా ప్రభుత్వం స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయనుందున మొత్తం ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇ స్తామని ప్రైవేట్ యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.
అయోమయంలో విద్యార్థులు
ఉన్నత విద్యకు వెళ్లే ముందు సర్టిఫికెట్ల రూ పంలో ఇంటర్ యాజమాన్యాలు చేస్తున్న తకరారుతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న తల్లిదండ్రులు ఫీజు చెల్లిస్తుండగా, మిగతా తల్లిదండ్రులు యా జ మాన్యాలను ప్రాధేయపడుతున్నారు. అయినప్పటికీ సర్టిఫికెట్ల జారీలో ఫలితం లభించడం లే దు. పలువురు విద్యార్థులు ఆనలైనలో డౌనలోడ్ చేసుకున్న జిరాక్స్ ప్రతితో డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. డిగ్రీ ప్రవేశాలకు టీసీ తప్పనిసరి అయినప్పటికీ అడ్మిషన్లలో డిగ్రీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల మధ్య నెలకొన్న పోటీతత్వంతో టీసీలు ఇవ్వకున్నా ప్రవేశాల తంతును పూర్తిచేస్తున్నారు. డిగ్రీ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ అప్లికేషన్లను కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోనే సరిపెడుతున్నారు. కానీ, సైన్స ఆధారిత ఎంసెట్, నీట్ తదితర కోర్సుల్లో చేరేందుకు తప్పనిసరిగా ఒరిజినల్ మెమో, టీసీ, స్టడీ కండక్ట్ సర్టిఫికెట్స్ తప్పనిసరి. దీంతో ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థులు తప్పనిసరిగా ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. కానీ, డిగ్రీ తదితర స్థానిక కోర్సుల్లో చేరే విద్యార్థులు ఆనలైన ప్రతులతోనే గట్టెక్కుతున్నట్టు ప్రైవేట్ యాజమాన్యాలు వాపోతున్నాయి. ఈ తరహా పరిస్థితికి ప్రభుత్వ వైఖరే కారణమని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా క్రమం తప్పకుండా నిధులను విడుదల చేస్తే విద్యార్థులు గౌరవప్రదంగా కళాశాలలు వీడే పరిస్థితి ఉం టుందని అంటున్నారు. కానీ, నిధుల విడుదల లో ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురవుతుండగా, యాజమాన్యాలు ఆర్థిక కుదుపునకు గురవుతున్నారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ని ధుల విడుదలపై ప్రైవేట్ యాజమాన్యాలకు హామీ ఇచ్చి సర్టిఫికెట్ల జారీని సులభతరం చే యాలని కోరుతున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో యాజమాన్యాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పల విడుదలలో ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న జాప్యంతో ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్యాలకు సుమారు రూ .40కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. విద్యార్థులు ఫీజులు చెల్లించక, ప్రభుత్వం నిధులు కేటాయించక యాజమాన్యాలు అప్పుల పాలయ్యాయి. అలాగే గతంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా సర్టిఫికెట్లను తీసుకొని పరిస్థితి ఉంది. మా ఆర్థిక దుస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం, తల్లిదండ్రులు సహకరించాలి.
- మల్లేశం, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఇంటర్ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన
సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పల బకాయిలతో నిమిత్తం లేకుండా ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే. బకాయిలు కోసం ప్రభుత్వంపై పోరాడాలి గానీ, విద్యార్థులను వేధించవద్దు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయాలి.
-సి.రమణి, ఇంటర్ నోడల్ అధికారి, యాదాద్రి జిల్లా