Share News

భక్తిభావంతో మంచిమార్గంలో నడవాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:06 AM

ప్రతి ఒక్కరూ జాలి, దయ, కరుణ, భక్తిభావం కలిగి మంచిమార్గంలో నడవాలని సూర్యాపేట ప్రముఖ విచారణ గురువు, విజయవాడ బిషప్‌ రాజారావు అన్నారు.

భక్తిభావంతో మంచిమార్గంలో నడవాలి
దివ్యబలి పూజలో ప్రసంగిస్తున్న విజయవాడ బిషప్‌ రాజారావు

మఠంపల్లి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరూ జాలి, దయ, కరుణ, భక్తిభావం కలిగి మంచిమార్గంలో నడవాలని సూర్యాపేట ప్రముఖ విచారణ గురువు, విజయవాడ బిషప్‌ రాజారావు అన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయం 29వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఏసుప్రభు చూపిన మార్గంలో నడిచి పునీతులు కావాలన్నారు. సమాజంలో సేవా మార్గంలో నడవాలన్నారు. ప్రపంచానికి క్రీస్తు బోధనలే మార్గదర్శకమన్నారు. రాష్ట్రంలోని క్రైస్తవులకు, మఠంపల్లికి ప్రత్యేక ఉందన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై మరియమాతను పురవీధుల్లో క్రైస్తవులు ఊరేగించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, పంటలు సమృద్ధిగా పండాలని భజనలు చేస్తూ పాటలు పాడారు. అంతకుముందు సమష్టి దివ్యబలి పూజకార్యక్రమాన్ని విచారణ గురువులు, మార్టిన్‌ పసల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచేకాక దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు వారు తరలిరావడంతో మఠంపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. శుభవార్త చర్చిలో గాదె సుజాత బృందం పాడిన పాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఫాదర్లు అల్లం బాలశౌరెడ్డి, తిరుమలరెడ్డి జోజిరెడ్డి, ఆదూరి స్రవంతికిషోర్‌రెడ్డి, ఆదూరి మధుసూదనరెడ్డి, టీఆర్‌ రాజారెడ్డి, జయభారతరెడ్డి, ఆదూరి శౌరెడ్డి, గాదె విక్టర్‌రెడ్డి, 30మంది విచారణ గురువులతో పాటు చర్చి కమిటీ పెద్దలు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో భారీగా బాణాసంచా కాల్చుతూ ఆనందోత్సాహాల నడుమ వేడుకలను జరుపుకున్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:06 AM