ఇక ఫేస్ రికగ్నేషన అటెండెన్స
ABN , Publish Date - Jun 19 , 2025 | 11:26 PM
రాష్ట్రంలో పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది.
రాష్ట్రంలో పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటోంది. అందుకు ముఖకవళిక (ఫేస్ రికగ్నేషన) హాజరు విధానాన్ని అమలుచేయనుంది.
ఆంధ్రజ్యోతి, యాదాద్రి
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల కు విన్నవించేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వస్తుంటారు. అయితే అధికారులు అం దుబాటులో లేకపోవడంతో వారు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతుంటారు. కార్యాలయాలకు ప్రజలు వచ్చిన రోజు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, అధికారులు కార్యాలయా ల్లో ఉన్న రోజుల్లో ప్రజలకు ఏదో ఒక కారణంతో కార్యాలయానికి రాకపోవడం వంటివి జరుగుతున్నాయి. దీంతో సమస్యలు దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ప్రజాపాలనలో ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మం డల పరిషత, జిల్లా పరిషత కార్యాలయాల్లో ప్ర జలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఎంపీపీ, జడ్పీ కార్యాలయాల్లోని అధికారులు సమయపాలన పాటించేలా చూసేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ఇక నుంచి అధికారులు, సిబ్బంది ఫేస్ రికగ్నేషన అటెండెన్స (ముఖకవళిక ఆధారిత హాజరు) ప్రవేశపెట్టనుంది. తొలుత రాష్ట్ర వ్యా ప్తంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ల్లో వీటిని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. వీటి ఏర్పాటుతో విధులకు ఎగనామం పెట్టే ఉ ద్యోగులకు ఇకపై కష్టతరం కానుంది. అధికారు లు, సిబ్బంది డుమ్మాలు కొట్టే అవకాశం లేకుం డా చెక్ పడనుంది. ఉమ్మడి జిల్లాలోని యాదాద్రిభువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని మండలాల వారీగా అధికారులు, సిబ్బంది వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.
రోజుకు రెండుసార్లు హాజరు
ఉమ్మడి జిల్లాలోని జిల్లాపరిషత, మండలపరిషత కార్యాలయాల్లోని సిబ్బంది రోజులో రెండుసార్లు ఫేస్ రికగ్నేషన అటెండెన్స తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రతీ జిల్లా పరిషతలో అధికారులు సిబ్బందితో కలిసి 10 నుంచి 15మంది వరకు ఉన్నారు. మండలపరిషతల్లో 10మందికి పైగానే అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం ప్రతీ ఒక్కరు సమయపాలన ప్రకారం ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 5గంటలకు తప్పకుండా హాజరు వేయాలి. కార్యాలయానికి ఆలస్యంగా వచ్చిన పక్షంలో సమయాన్ని బట్టి సెలవుల్లో కోత విధించే అవకాశం ఉంది. ఇప్పటికే నూతన హాజరు విధానానికి సంబంధించి ఉద్యోగుల పూర్తి వివరాలను సేకరించిన ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించింది.
అటెండెన్స రిజిస్టర్‌కు చెల్లు
ప్రస్తుతం జిల్లా, మండల పరిషత కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అటెండెన్స రిజిస్టర్‌లో సంతకం చేస్తున్నారు. ఈ విధానంతో సిబ్బంది ఒక రోజు కార్యాలయానికి హాజరుకాకున్నా, అధికారి అనుమతితో వచ్చినట్టు సంతకాలు చేయడం, ఆలస్యంగా వచ్చి త్వరగా వెళ్లిపోవడం వంటివి జరుగుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. మారుమూల మండలాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటంలేదని, సిబ్బంది కూడా సకాలంలో హాజరు కావడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్టర్‌లో సంతకం చేసే విధానాన్ని పక్కనపెట్టి, పక్కాగా ఫేస్ రికగ్నేషన అటెండెన్స ఉండేలా ప్రభుత్వం చర్య లు చేపట్టింది. ఈ విధానంతో అమలుతో అధికారులు సకాలంలో కార్యాలయాలకు హాజరుకావడంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు కూడా వారు సమస్యలను విన్నవించే అవకాశం కల్పించినట్టు అవుతుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఈ హాజరు విధానం త్వరలోనే అమలుకానుంది.
ఉమ్మడి జిల్లాలో త్వరలో..
ఉమ్మడి జిల్లాలో మూడు జిల్లా పరిషత కార్యాలయాలు ఉండగా, యాదాద్రి జిల్లాలో 17 మండల పరిషతలు, నల్లగొండ జిల్లాలో 34, సూర్యాపేట జిల్లాలో 23 మండల పరిషతలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీడీవోలు, ఇతర అధికారులు, సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదించింది. త్వరలోనే ఫేస్ రికగ్నేషన అటెండెన్స అమలులోకి రానుంది. దీనికి సంబంధించిన యంత్రాలను ప్రభుత్వం మండల, జిల్లాపరిషత కార్యాలయాల్లో ఏర్పాటు చేయనుంది. క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారుల హాజరుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
త్వరలోనే నూతన హాజరు విధానం
ఉమ్మడి జిల్లాలోని జిల్లాపరిషత, మండలపరిషత కార్యాలయాల్లోని సిబ్బంది రోజులో రెండుసార్లు ఫేస్ రికగ్నేషన అటెండెన్స తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతీ జిల్లా పరిషతలో అధికారులు సిబ్బందితో కలిసి 10 నుంచి 15మంది, మండలపరిషతల్లో 10మందికి పైగానే అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం ప్రతి ఒక్కరూ సమయపాలన ప్రకారం ఉదయం 10.30గంటలకు, సాయంత్రం 5గంటలకు తప్పకుండా హాజరు నమోదు చేయాలని కార్యాలయానికి ఆలస్యంగా వచ్చిన పక్షంలో సమయాన్ని బట్టి సెలవుల్లో కోత విధించే అవకాశం ఉం టుంది. ఇప్పటికే నూతన హాజరువిధానానికి సంబంధించిన ఉద్యోగులు పూర్తి వివరాలను సేకరించి, ప్రభుత్వానికి నివేదించాం.
శోభారాణి, జడ్పీ సీఈవో