యూనివర్సిటీ ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:37 AM
హుజూర్‌నగర్ పరిధిలోని మగ్దుమ్‌నగర్‌లో వ్యవసాయ ఏర్పాటుకు పభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలో నోటిఫికేషన జారీ చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు.
హుజూర్‌నగర్ పరిధిలోని మగ్దుమ్‌నగర్‌లో వ్యవసాయ ఏర్పాటుకు పభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలో నోటిఫికేషన జారీ చేసేందుకు కసరత్తు పూర్తి చేశారు. యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన భూ మి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులు ఇప్పటికే అందించా రు.మరో 10రోజుల్లో ప్రభుత్వం జీవో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
- (ఆంధ్రజ్యోతి - హుజూర్‌నగర్)
వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు కోసం హుజూర్‌నగర్ ని యోజకవర్గంలోని మేళ్లచెర్వు, పాలకవీడు, హుజూర్‌నగర్ మండలాల్లో భూ పరిశీలన చేశారు. హైదరాబాద్‌లోని వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు, వీసీ, ఇతర ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు పలు మం డలాల్లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. అయితే హుజూర్‌నగర్ పరిధిలోని మగ్దుమ్‌నగర్, యర్రగట్టు ప్రాంతాల్లోని సర్వే నెం బరు 1,041లోని ప్రభుత్వ భూమిని యూనివర్సిటీ ఏర్పాటుకు ఖరారుచేసినట్లు తెలిసింది. ఇందుకోసం సుమారు 230 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇప్పటికే 70 శాతం భూసర్వే పూర్తిచేశారు. మిగిలి న భూములను కూడా త్వరలో సర్వే చేయనున్నారు. మొత్తం 273 ఎకరాల ప్రభుత్వ భూమిలో 40ఎకరాల్లో మగ్దుమ్‌నగర్ గ్రామం విస్తరించించి ఉంది. మిగిలిన 230 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యూనివర్సిటీ, కళాశాల నిర్మాణానికి వినియోగించనున్నారు.
మూడు దశాబ్దాలుగా సాగులో...
యూనివర్సిటీ ఏర్పాటుచేసే ప్రభుత్వ భూమిలో 260 మంది రైతు లు సాగు చేస్తున్నారు. ఈ భూములకు సంబంధించి మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు సన్న, చిన్నకారు రైతులకు పట్టాలు పంపిణీ చేశా యి. మూడు నెలలుగా ఆయా రైతుల వివరాలను అధికారులు సేకరించారు. 2 నెలలుగా ఆ ప్రాంత రైతులతో అధికారులు చర్చలు జరిపారు. మొదటిసారి ప్రజాభవన టౌనహాల్‌లో నిర్వహించిన చర్చలకు 50మంది రైతులు హాజరై యూనివర్సిటీ ఏర్పాటులో భాగంగా భూసేకరణను స్వాగతించారు. దీంతో రైతులను అన్నివిధాలా ఆదుకుంటామ ని, న్యాయం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం భూ సేకరణ అధికారి ఐదుగురు ప్రతినిధుల బృందంతో సర్వే చేపట్టారు. 10 రోజుల పాటు సర్వే చేయగా చివరి దశలో కొందరు రైతులు సర్వేను అడ్డుకున్నారు. ఆర్డీ వో, తహసీల్దార్ కార్యాలయా ల ఎదుట ఽఆందోళనలు చేశారు. ఆ తర్వాత జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట కూడా ఆందోళన చే పట్టారు. ఆయా ఆందోళనల్లో రాజకీయ నా యకులు ఉండటంతో యూనివర్సిటీ ఏ ర్పాటుపై అనుమానాలు. తలెత్తాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో వ్యవసాయ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకం కానుంది. సుమారు రూ.1000 కోట్లతో యూనివర్సిటీ, కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. యూనివర్సిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి కొత్త వరివంగడాలు రైతులకు అందుబాటులోకి రావడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉండటంతో రైతులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మార్చి 30ఉగాది రోజున హుజూర్‌నగర్‌కు వచ్చిన సీఎం రేవంతరెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థన మేరకు వ్యవసాయ.. యూనివర్సిటీ, కళాశాలను మంజూరు చేశారు. ఈ నెల మొదటి వారంలోనే యూనివర్సిటీ ఏర్పాటుపై నోటిఫికేషన వచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.