పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదు
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:42 AM
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అ న్నారు. మండల కేంద్రంలో శుక్రవారం లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
తుర్కపల్లి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అ న్నారు. మండల కేంద్రంలో శుక్రవారం లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డు లు అందజేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని, సీఎం రేవంత్‌రెడ్డి ఓ వైపు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మరోవైపు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృ ష్ణారెడ్డి, ఆలేరు మార్కుట్ చైర్మన్ అయినాల చైతన్యరెడ్డి, మండల ప్రత్యేకాధికారి జానయ్య, ఎంపీడీవో లెంకల గీతారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధ నావతు శంకర్‌నాయక్, నాయకులు పలుగల శ్రీనివాస్, చాడ భాస్కర్‌రెడ్డి, మోహన్‌బాబు, అయిలయ్య, భూక్య రాజారాంనాయక్ పాల్గొన్నారు.
పేదింటి కల నెరవేరింది
రాజాపేట: కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సొంతింటి కల నెరవేరిందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. రాజాపేట మండలం సోమారం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి హాజరయ్యారు. పల్లపు సుశీల కుటుంబ సభ్యులకు వస్త్రాలు, గొర్రె పొట్టేల్‌ను అందజేశారు. అనంతరం ఇంటి ఆవరణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శాంతి నిర్మల, ఎంపీడీవో నాగవేణి, తహసీల్దార్ అనిత, నాయకులు మహేందర్‌గౌడ్, పెంటయ్య, బాల్‌రాజ్, భిక్షపతి, జగన్‌మోహన్‌రెడ్డి, సుభా్‌షరెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.
బొమ్మలరామారం: పనుల జాతర కార్యక్రమం ద్వారా అభివృద్ధి పరుగులు తీసే విధంగా పనిచేయాలని బీర్ల అయిలయ్య అన్నారు. మండలంలోని మర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో లబ్ధిదారులకు పనిదినాలు తగ్గినప్పటికీ రోజువారి కూలి రూ. 310 నుంచయి రూ.320 వరకు పెరిగిందన్నారు. అంతకుముందు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రేషన్‌కార్డుల పంపిణీలో, మల్యాలలో మార్నింగ్‌వాక్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో నాగిరెడ్డి, డీపీవో సునంద, తహసీల్దార్ శ్రీనివా్‌సరావు, ఎంపీడీవో రాజా త్రివిక్రమ్ పాల్గొన్నారు.