Share News

ఇక ధాన్యం ఆరబెట్టే శ్రమలేదు

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:52 AM

చౌటుప్పల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు గాను అఉనాతన యంత్రం (ప్యాడీ డయ్యర్‌)ను ప్రభుత్వం సమకూర్చింది.

ఇక ధాన్యం ఆరబెట్టే శ్రమలేదు

మార్కెట్‌యార్డుకు యంత్రం వచ్చేసింది

రైతుల్లో హర్షం

చౌటుప్పల్‌ టౌన, జూలై 15 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు గాను అఉనాతన యంత్రం (ప్యాడీ డయ్యర్‌)ను ప్రభుత్వం సమకూర్చింది. దీంతో రైతులకు జరిగే అనవసర వ్యయం తగ్గిపోతుండడంతో హర్షం వ్యక్తమవుతోంది. వ్యవసాయ మార్కెట్‌ నిధుల నుంచి రూ.14.40 లక్షలను కేటాయించి, ఈ యంత్రాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌యార్డులో భద్రపరిచారు. ధాన్యంతో ట్రయల్‌ రన కూడా చేశారు. ప్యాడీ డయ్యర్‌ రైతుల ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ధాన్యాన్ని ఆరబెట్టడం, రాశులు చేయడం వంటి బాధలు ఇక నుంచి రైతులకు తప్పనున్నాయి. వ్యవసాయ పొలాల వద్ద కల్లాలు లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్యాడీ డయ్యర్‌ ప్రాముఖ్యతను సంతరించుకుంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టి రాశులు పోసుకునేందుకు గాను రైతులకు అధిక వ్యయం అవుతోంది. ఇక నుంచి ఇలాంటి ఖర్చులు, రైతుల శ్రమ తొలగిపోనున్నాయి. వానా కాలం సీజన లో ఈ యంత్రం 24 గంటలు పని చేయవలసి ఉంటుంది. ఇప్పటికే మా ర్కెట్‌ యార్డులో ప్యాడీ క్లీనర్‌ అందుబాటులో ఉంది. ప్యాడీ డయ్యర్‌, ప్యాడీ క్లీనర్‌ లతో రైతులకు ఎంతో ఉపయోగం జరగనుంది. ఈ ప్యాడీ డయ్యర్‌ను మార్కెట్‌ యార్డుకు కేటాయించేందుకు అదనపు కలెక్టర్‌ వీరా రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

పనిచేసే విధానం..

ప్యాడీ డయ్యర్‌లో ఒక దపాలో 60 బస్తాల(24 క్వింటాళ్లు) వరి ధాన్యాన్ని ఒక గంటన్నర (90 నిమిషాలు) లో ఆరబెట్టవచ్చు. 45నిమిషాల వ్యవధిలో యంత్రంలో ధాన్యం నింపడం, 25 నిమిషాల్లో ధాన్యా న్ని డ్రై చేయడం, 20 నిమిషాల పాటు ధాన్యాన్ని కూల్‌ చేయడం వంటి చర్యలు కొనసాగుతాయి. ట్రాక్టర్‌ సాయంతో ఈ యంత్రం పనిచేస్తుంది. అందులో ధాన్యాన్ని డ్రై చేసేందుకు మాత్రం ప్రత్యేకంగా పని చేసే హీటర్‌కు డీజిల్‌ను ఉపయోగించవలసి ఉంటుంది. ట్రాక్టర్‌తో పాటు డ్రై హీటర్‌కు అవసరమైన డీజిల్‌ను రైతు సమకూర్చు కోవలసి ఉంటుంది.

ప్యాడీ డయ్యర్‌ను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టు కునేందుకు గాను ప్యాడీ డయ్యర్‌ ఎంత గానో ఉపయోగపడుతుందని ఏఎంసీ సెక్రటరీ రవీందర్‌ రెడ్డి తెలిపారు. వానా కాలం సీజన నుంచి ప్యాడీ డయ్యర్‌ వినియోగంలోకి వస్తుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోని ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన కోరారు.

-రవీందర్‌రెడ్డి, ఏఎంసీ సెక్రటరీ

ప్యాడీ డయ్యర్‌ను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టు కునేందుకు గాను ప్యాడీ డయ్యర్‌ ఎంత గానో ఉపయోగపడుతుందని ఏఎంసీ సెక్రటరీ రవీందర్‌ రెడ్డి తెలిపారు. వానా కాలం సీజన నుంచి ప్యాడీ డయ్యర్‌ వినియోగంలోకి వస్తుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోని ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన కోరారు.

-రవీందర్‌రెడ్డి, ఏఎంసీ సెక్రటరీ

Updated Date - Jul 16 , 2025 | 12:52 AM