Share News

రంగంలో .. ఎన్జీ కళాశాల ఘనకీర్తి

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:52 AM

పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఆ కళాశాల ఒక వ రం లాటింది. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు తమ అదృష్టంగా భావిస్తారు.

 రంగంలో .. ఎన్జీ కళాశాల ఘనకీర్తి

183 దేశాల్లో వివిధ రంగాలో ్ల రాణిస్తున్న పూర్వ విద్యార్థులు

27రకాల కోర్సులతో దినదిన ప్రవర్ధమానం

తెలంగాణ టాప్‌ -3 స్థానంలో కళాశాల

ఈ నెల 22న 70వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ

ప్లాటినం వేడుకలకు సర్వం సిద్ధం

నల్లగొండ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఆ కళాశాల ఒక వ రం లాటింది. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు తమ అదృష్టంగా భావిస్తారు. విద్యా రంగంలోనే ఘన కీర్తిని చాటుతున్న నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల 70వ వసంతంలోకి అడుగిడుతోంది. 1956వ సంవత్సరంలో ప్రారంభమైన ఎన్జీ కళాశాల స్థాపక దినోత్సవాన్ని ఈ నెల 22వ తేదీన నిర్వహించేందుకు, ప్లాటినం వేడుకలను నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఎన్జీ కళాశాలలో డిగ్రీతో పాటు పీజీ కోర్సులు ఉన్నాయి. 27రకాల కోర్సులతో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతోంది. ఆరు పీజీ కోర్సులతో కొనసాగుతోంది. బీఎస్సీ, బీఏ, బీకాంలతో పాటు బీసీఏ, బీబీఏ వంటి అదనపు కోర్సులు ఉండగా ఆయా విభాగాల్లో మొత్తం 1560 సీట్లు ఉన్నాయి. అదనంగా కోర్సుల్లో మరో 2500మంది వరకు విద్యను అభ్యసిస్తున్నారు. ఎన్జీ కళాశాలకు విశాలమైన క్రీడా మైదానంతో పాటు నూతన తరగతి గదులు, ఆధునాతనమైన ప్రయోగశాలలు, అతిపెద్ద గ్రంథాలయం వంటి సౌకర్యాల ఉన్నా యి. ఈ కళాశాలలో అనుభవజ్ఞులైన ఆధ్యాపకులతో బోధన చేయడంతో ఏటా విద్యార్థులు ఆయా కోర్సుల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. విద్యార్థులు ఉద్యోగాలు సాధించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఆయా రంగాల్లో రాణించడానికి వేదికగా మారింది. ఎనఎ్‌సఎ్‌స, ఎనసీసీ విభాగాలను కూడా నిర్వహిస్తూ విద్యార్థులను సమాజ సేవలో భాగస్వామ్యులను చేయడంలో ఆధ్యాపకుల పాత్ర ఎంతగానో ఉంది. గ్రంథాలయాన్ని పూర్తిగా డిజిటలైజేషన చేయడంతో పాటు సుమారు 60వేలకు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచారు. అకాడమిక్‌తో పాటు పీజీ ఎంట్రన్స, పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు రీడింగ్‌ హాల్‌లో అందుబాటులో ఉన్నాయి.

1956వ సంవత్సరంలో ఎన్జీ కళాశాల స్థాపన

1956వ సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి బూర్గు ల రామకృష్ణారావు చేతుల మీదుగా బీఏ కోర్సులో 90 మంది విద్యార్థులతో ప్రారంభమై 69 వసంతాలు పూర్తి చేసుకుని 70 వసంతంలోకి అడుగిడి ప్లాటినం వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అన్ని గ్రూపులు, కోర్సు లు కలిపి నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసించడం విశేషం. ఎన్జీ కళాశాలలో గత 69సంవత్సరాల్లో చదివిన పూర్వ విద్యార్థులు అనేక మంది 183 దేశాలల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. అఖిల భారత సర్వీసులతో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఎంతో మంది రాణిస్తున్నారు. ప్ర స్తుతం ఉన్న పాత భవనం శిథిలావస్థకు చేరి కూలిపో యే దశలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.36కోట్లు విడుదల చేయడంతో నూతన భవనాన్ని నిర్మించారు. అందులో తరగతుల నిర్వహణ కొనసాగుతోంది.

ప్రతిభ చాటిన విద్యార్థులకు బంగారు పతకాలు

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 23 సంవత్సరాలుగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేస్తున్నారు. కళాశాల పూర్వ ప్రధా న చార్యులు భాస్కర్‌రావు, విద్యార్థుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.లింగయ్య కలిసి ఈ సంవత్సరం సుమారు రూ.10.50లక్షలు కళాశాల కు అందజేయడంతో ఈ విద్యా సంవత్సరం కూడా బం గారు పతకాల కార్యక్రమాన్ని కళాశాల చేపట్టింది. ఈనెల 22న జరిగే ప్లాటినం వేడుకల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్‌ ప్రధానం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఔత్సాహికులు ఉంటే లక్ష 50వేలు కళాశాలలో డిపాజిట్‌ చేస్తే వారి పేరు మీద లేదా వారు సూచించిన వారి పేరు మీద ప్రతి ఏటా బంగారు పతకాలను అందజేస్తారు. ఈ మేరకు కళాశా ల తరపున విరాళాలు అందజేయాలని కోరుతున్నారు.

అమెరికా పోర్టులాండ్‌ యూనివర్సిటీలో పూర్వ విద్యార్థులు

అమెరికాలోని ఓరేగాన రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద పోర్టులాండ్‌ యూనివర్సిటీలో ఎనజీ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు అనేక మంది పీహెచడీ రీసెర్చ్‌ స్కాలర్స్‌గా పనిచేస్తూ ఎన్జీ కళాశాల ప్రతిష్ట ను దేశ విదేశాల్లో నిలబెట్టారని చెప్పవచ్చు. పోర్టులాండ్‌ నగరంలో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయం ఈ పోర్టులాండ్‌ స్టేట్‌ (పీఎ్‌సవో) యూనివర్సిటీ ఇం దులో ఎన్జీ కళాశాల పూర్వ విద్యార్థులు రాణిస్తున్నా రు. నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే టాప్‌ -3 స్థానంలో ఉంది. అడ్మీషన్ల పెరుగుదల విషయంతో పాటు విద్యార్థులు ఉన్నత స్థితికి చేరడం వల్ల కళాశాలకు మంచి స్థానం ఉందని చెప్పవచ్చు. ఈ కళాశాల స్థాపక దినోత్సవానికి ప్రముఖులతో పాటు పూర్వ విద్యార్థులు హాజరు కానున్నారు.

ఎనజీ కళాశాల ప్రతిషాత్మకమైనది

నేను ఎన్జీ కళాశాల పూర్వ విద్యార్థిని. ఇదే కళాశాలలో డిగ్రీ పూర్తి చేను. ఈ కళాశాలలోనే విద్యాభోదనం చేయ డం నాకు ఆనందంగా ఉంది. ఈ కళాశాల ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేస్తున్నాం. ఎంతో మంది పూర్వ విద్యార్థులు అత్యున్నత రంగాలకు ఎదిగారు. ప్రస్తుతం అనేక మంది పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారందరినీ చూస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. కళాశాల ప్లాటినం వేడుకలను విజయవంతం చేయాలి.

- బి.నాగరాజు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మైక్రోబయాలజీ, ఎన్జీ కళాశాల

ఎంతో మంది అత్యున్నత స్థానాల్లో ఉన్నారు

ఎన్జీ కళాశాలలో చదివిన ఎం తో మంది విద్యార్థులు అత్యున్నత స్థానాలకు ఎదగడం ఎంతో గర్వకారణం. 69సంవత్సరాలు పూర్తి చేసుసుని 70వ వసంతంలోకి అడుగిడుతోంది. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ స్కాలర్స్‌గా రా ణిస్తున్నారు. అది ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈకళాశాల తెలంగాణలోనే టాప్‌-3స్థానంలో ఉంది.

- టి.రవికుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కెమిసీ్ట్ర, ఎన్జీ కళాశాల

183 దేశాల్లో రాణించడం సంతోషదాయకం

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన అనేక మంది పూర్వ విద్యార్థులు 183 దేశా ల్లో వివిధ రంగాలల్లో పనిచేయడం సంతోషాన్ని ఇస్తోంది. అఖిల భారత సర్వీసుతో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఎన్జీ కళాశాల స్థాపన దినోత్సవాన్ని ఈ నెల 22న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యా యి. స్థాపక దినోత్సవంలో బంగారు పతకాల ప్రదానోత్సవానికి ఎంజీయూ ఉపకులపతి అల్తాఫ్‌ ఖాజా హుస్సేనతో పాటు పలువురు హాజరవుతున్నారు. కార్యక్రమాన్ని విద్యార్ధులు విజయవంతం చేయాలి.

- డాక్టర్‌ సముద్రాల ఉపేందర్‌, ప్రిన్సిపాల్‌, ఎన్జీ కళాశాల

Updated Date - Jul 19 , 2025 | 12:53 AM