Share News

ఇంటర్‌ ప్రశ్నపత్రాల ప్యాకింగ్‌లో నిర్లక్ష్యం

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:17 AM

ఇంటర్‌ పరీక్షల ప్రశ్నపత్రాల ప్యాకింగ్‌లో అధికారుల నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. ఎంతో జాగ్రత్తగా, ఏ రోజు పరీక్షలకు సం బంధించిన ప్రశ్నపత్రాలను ఆ రోజు మాత్రమే, మూడేసి సెట్ల మేర ప్యాక్‌ చేయాలి.

ఇంటర్‌ ప్రశ్నపత్రాల ప్యాకింగ్‌లో నిర్లక్ష్యం

ఆరో రోజు కవర్‌లో ఏడో రోజు ప్రశ్నపత్రాలు

బెంబేలెత్తిన పరీక్షల నిర్వహణ అధికారులు

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అక్కడే ఉండడంతో తక్షణం దిద్దుబాటు చర్యలు 8

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం

నల్లగొండ, మార్చి 15 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఇంటర్‌ పరీక్షల ప్రశ్నపత్రాల ప్యాకింగ్‌లో అధికారుల నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. ఎంతో జాగ్రత్తగా, ఏ రోజు పరీక్షలకు సం బంధించిన ప్రశ్నపత్రాలను ఆ రోజు మాత్రమే, మూడేసి సెట్ల మేర ప్యాక్‌ చేయాలి. అయితే మరో రోజుకు సంబంధించిన ప్రశ్నపత్రాలను సైతం ముందురోజు ప్యాకెట్‌లో కలిపేసిన అం శం పరీక్షల నిర్వహణ అధికారులను, కేంద్రాల నిర్వాహకులను బెంబేలెత్తించింది. ప్రశ్నపత్రాల కవర్‌ సీల్‌ తెరిచాక అదనపు మరుసటి రోజు ప్రశ్నపత్రాలు అదనంగా ఉండటంతో సదరు పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి హడావుడిగా వాటిని మళ్లీ కవర్లో భద్రపరచి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని ఓఇంటర్‌ పరీక్షా కేంద్రంలో జరిగిన ఈ తతంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆరో రోజు కవర్లో ఏడోరోజు ఒకేషనల్‌ పేపర్లు.

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని ఓ పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రాల ప్యాకేజీలో లొసుగులు బయటపడ్డాయి. అన్ని పరీక్షా కేంద్రాలకు పంపినట్లే ఇక్కడ పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా అవసరమైన ప్రశ్నపత్రాల కవర్లను ఇంటర్‌బోర్డు, డీఐఈవో నుంచి పోలీస్‌ బందోబస్తు నడుమ పరీక్షల ప్రారంభానికి ముందే కేంద్రానికి వచ్చాయి. అక్కడ వచ్చిన పేపర్లను, సెట్లను సరిచూసుకు న్న చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి వాటిని ఇంటర్‌బోర్డు సూచనలకు అనుగుణంగా పరీక్షల తేదీలు, పేపర్ల వారీగా కవర్లలో ప్యాక్‌ చేసి, సీల్‌వేసి పోలీ్‌సస్టేషన్‌లో భద్రపరిచారు. ఎంతో పకడ్బందీగా, ఒకటికి రెండు పర్యాయాలు చెక్‌చేసుకొని మరీ ఈ కవ ర్‌ ప్యాక్‌ చేయాల్సి ఉంటుంది. ఏ రోజు పరీక్ష ఉంటే, ఆ రోజుకు సంబంధించిన కవర్లను పోలీస్‌ బందోబస్తుతో పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి అక్కడ సీసీ కెమెరా సమక్షంలోనే ఓపెన్‌ చేసి విద్యార్థులకు పంపిణీ చేస్తారు. అయితే ఈ కేంద్రంలో ఆరో రోజున అంటే 12వ తేదీన పరీక్ష ప్రశ్నపత్రాలకు సంబంధించిన కవర్‌ను సీల్‌ తొలగించి ఓపెన్‌ చేయగా, అందులోనే ఏడో రోజున నిర్వహించే ఒకేషనల్‌ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఉన్నాయి. అప్పటి కే అక్కడికి చేరుకున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృం దం ఏడో రోజు ప్రశ్నపత్రాలున్న విషయాన్ని గుర్తించింది. దీంతో బెంబేలెత్తిన చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి, ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌తో చర్చించిన పిదప ఆ ప్రశ్నాపత్రాలను తిరిగి కవర్‌లో సీల్‌ చేసి వెంటనే పోలీ్‌సస్టేషన్‌కు పంపారు. అయితే ఏమరుపాటుగా ఉండి, ఆ ప్రశ్నాపత్రాలను సైతం విద్యార్థులకు పంపిణీ చేసినా, లేదా పట్టించుకోకుండా అక్కడే వదిలేసినా ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యేవని చెబుతున్నారు. ప్రశ్నపత్రాలను ప్యాక్‌ చేసే సందర్భంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఒకేషనల్‌ పేపర్లు కావడం వల్ల అంత సీరియ్‌సగా కనిపించకపోయినా, అదే స్థానంలో ఇతర సబ్జెక్టుల ప్రశ్నపత్రాలైతే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేదోనని, పేపర్‌ లీక్‌ అయినట్లే భావించాల్సి వచ్చేదని పలువురు ఇన్విజిలేటర్లు, అధ్యాపకులు వాపోతున్నారు. ఎంతో జాగ్రత్తగా, పకడ్బందీగా చేపట్టాల్సిన ప్రశ్నపత్రాల ప్యాకింగ్‌ పనులను పూర్తి నిర్లక్ష్యంగా చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నపత్రాల రాంగ్‌ ప్యాకింగ్‌పై ఇంటర్‌బోర్డుకు ఇప్పటికే సమాచారం అందింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, బాధ్యులైన చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు, అధ్యాపకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:17 AM