నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించాలి
ABN , Publish Date - May 26 , 2025 | 12:26 AM
గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు బీఆర్‌ఎస్ హయాంలో ఏర్పా టు చేసిన తాటి నీరా ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
భువనగిరి రూరల్, మే 25(ఆంధ్రజ్యోతి): గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు బీఆర్‌ఎస్ హయాంలో ఏర్పా టు చేసిన తాటి నీరా ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. భువనగిరి మండలంలోని నం దనం గ్రామంలో నిరుపయోగంగా ఉన్న తాటి నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని వారు గీత కార్మికులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ నిర్మాణం పూర్తయి ఏడాదిన్నర దాటినా వినియోగంలోకి తీసుకురాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరికాదన్నారు. గత ప్రభుత్వంలో రూ.7కోట్లతో నిర్మించిన ఉత్పత్తుల కేంద్రం శిథిలావస్థకు చేరుతున్నా, ప్రారంభించకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు. కేంద్రాన్ని జూన్ 2వ తేదీలోపు ప్రారంభించి స్థానిక గౌడ కులస్తులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఈ ఉత్పత్తి కేంద్రానికి బొమ్మగాని ధర్మభిక్షం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో కల్లుగీత కార్మిక పారిశ్రామిక రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, నాయకులు జనగాం పాండు, ఏవీ కిరణ్, డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, నీల ఓం ప్రకాశ్, జక్క రాఘవేందర్ రెడ్డి, కడమంచి ప్రభాకర్, మట్ట ధనుంజయ, రాంపల్లి నగేశ్, నర్సింహ, అంజయ్య, మమత, శ్రీనివాస్ గౌడ్, దేవేందర్, సిల్వేరు మధు, నాగరాజు, జీవన్ పాల్గొన్నారు.