క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:52 AM
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైన కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మం గళవారం దళార్చనలు, నృసింహుడికి నిత్య పూజలు శాసో్త్రక్తంగా జరిగాయి.
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి)ః యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైన కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మం గళవారం దళార్చనలు, నృసింహుడికి నిత్య పూజలు శాసో్త్రక్తంగా జరిగాయి. కొండపైన విష్ణుపుష్కరిని చెం త ఆంజనేయస్వామిని వేదమంత్రాలతో పంచామృతభిషేకం చేసిన అర్చకులు సింధూరం వివిద రకాల పుష్పాలతో అలంకరించారు. ఆంజనేయుడికి సహస్రనామ పఠనాలతో నాగవల్లీ దళార్చన చేపట్టారు. ప్రధానాలయంలోని స్వయంభువులను సుప్రభాత సేవతో మేల్కొలిపి నిజాభిషేకం, నిత్యార్చనలు ముఖమండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య కళ్యాణ పర్వాలను పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. కొండపైన అనుబంధ శివాలయంలో శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామికి ముఖ మండపంలోని స్పటికమూర్తులకు నిత్యపూజలు, నిత్య రుద్రహవనం, సీతారామచంద్రస్వామి వసంతోత్సవాలు శైవగమ పద్ధ్దతిలో కొనసాగాయి. అనుబంధ పాతగుట్ట ఆలయం విష్ణుపుష్కరిణి కొండపైన శివాలయంలోని ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ అర్చకులు ప్రత్యేక పూ జలు చేపట్టారు. ఆలయ ఖజానాకు వివిధ విబాగాల ద్వార రూ.24,39,016 ఆదాయం సమకూరినట్ల్లు ఆల య ఏ భాస్కర్‌రావు తెలిపారు.
34 రోజుల్లో రూ.2.41కోట్ల ఆదాయం
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ ఖజానాకు 34 రోజుల్లో రూ.2.41 కోట్ల హుండీ ఆదాయం లభించింది. మార్చి 26 నుంచి ఈ నెల 28వ వరకు నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. లెక్కింపులో నగదు రూ.2,41,35,238, 143గ్రాముల మిశ్రమ బంగారం, 4.250కిలోల మిశ్రమ వెండి సమకూరింది. విదేశీ కరె న్సీ 702 అమెరికా డాలర్లు, 210 ఆస్ట్రేలియా డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 70 ఇంగ్లండ్ పౌండ్లు, 140 నేపాల్సీ రూపీ, 435 సౌదీ రియాల్, 10 యూరోలు, 12 ఒమన్ రియాల్, 31 మలేషియా రినగ్గిట్, 2.25 ఖతార్ రియాల్, 40 థాయిలాండ్ బాట్, 1000 శ్రీలంక కరెన్సీ, 20,000 టాంజానియా కరెన్సీ, 245 అరబ్ ఎమిరేట్స్ కరెన్సీ, 100 నార్వే కరెన్సీ హుండీలో కానుకల రూపంలో రావటంతో ఆలయ ఖజానాలో జమచేసినట్లు దేవస్థాన ఈవో భాస్కర్‌రావు తెలిపారు.
స్వామివారి సేవలో సినీనటుడు రాజేంద్రప్రసాద్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ మంగళవారం రాత్రి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.