Share News

భార్యను వేధిస్తున్నాడనే హత్య

ABN , Publish Date - May 05 , 2025 | 11:54 PM

తుర్కపల్లి, మే 5 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాల్‌పూర్‌ గ్రామంలో ఐదు రోజుల క్రితం హత్యకు గురైన యువకుడి కేసును పోలీసులు చేధించారు. హత్యకు పాల్పడ్డ నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌కు తరలించారు.

భార్యను వేధిస్తున్నాడనే హత్య

తుర్కపల్లి, మే 5 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాల్‌పూర్‌ గ్రామంలో ఐదు రోజుల క్రితం హత్యకు గురైన యువకుడి కేసును పోలీసులు చేధించారు. హత్యకు పాల్పడ్డ నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను యాదగిరిగుట్ట సీఐ కొండల్‌రావు సోమవారం తుర్కపల్లి పోలీ్‌సస్టేషన్‌లో వెల్లడించారు. గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన వివాహిత మహిళను అదే గ్రామానికి చెందిన దాసారం సాయికుమార్‌(21) ఆరు నెలలుగా అసభ్యకరంగా వేధిస్తున్నాడు. సదరు మహిళ ఈ విషయాన్ని భర్త తలారి ఆంజనేయులకు తెలిపింది. దీంతోఆంజనేయులు తన భార్య జోలికి రావద్దని సాయికుమార్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతడి తీరులో మా ర్పు రాలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆంజనేయులు సాయికుమార్‌ను హత మార్చాలని ప్రణాళిక రూపొందించాడు. తన బంధువులైన తలారి కొండయ్య, తలారి వెంకటేశ్‌, సిద్దిపేట జిల్లా ములుగు మండలం బలింపురం గ్రామానికి చెందిన గువ్వ రమేశ్‌ సాయం తీసుకున్నాడు. ఈ నెల 1వ తేదీ సాయంత్రం సాయికుమార్‌ తన బావి వద్దకు వెళ్తుండగా వెంబడించి అతనిపై దాడి చేశారు. ఇనుప రాడ్‌ తో తలపై కొట్టి, టవల్‌, డ్రిప్‌ పైపుతో మెడకు చుట్టి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆంజనేయులు బంధువైన రమేశ్‌ కారులో మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా ములుగు మండలం బస్వాపూర్‌ శివారులోని సింగన్న గూ డెం గ్రామంలోని అటవీప్రాంతంలో మృతదేహాన్ని డీజిల్‌ పోసి మృతదేహాన్ని కాల్చి వేసి నట్లు సీఐ తెలిపారు. కాగా దాసారం రాములుకు తన కుమారుడు సాయికుమార్‌ కనిపించడం లేదని ఈనెల 2న తుర్కపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా డు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బస్వాపూర్‌ శివారులో యువకుడిని హత్య చేసి దహనం చేసిన గుర్తు తెలియని శవం ఆచూకీ ములుగు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ములుగు పోలీసులు మృతదేహాన్ని గజ్వేల్‌ ఆసుపత్రిలో మా ర్చురీలో ఉంచి చుట్టు పక్కల ఉన్న పోలీ్‌సస్టేషన్లకు సమాచారం అం దించారు. తుర్కపల్లి పోలీ్‌సస్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు కావడంతో పోలీ్‌సలు సాయికుమార్‌ తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. ఆయన కుటుంబ సభ్యు లు మార్చురీకి వెళ్లి మృతదేహన్ని పరిశీలించారు. మృతదేహంపై ఉన్న టాటును గుర్తిం చి తమ కుమారుడు సాయి కుమాదేనని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో తన కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని సాయికుమార్‌ తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ ప్రారంభించి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా సాయికుమార్‌ను తామే హత్య చేసినట్లుగా తలారి ఆంజనేయులు, తలారి కొండ య్య, గువ్వ రమేశ్‌, తలారి వెంకటేశ్‌ అంగీ కరించారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్‌ చేసినట్లు సీఐ తెలిపారు. కేసును చేధించిన ఎస్‌ఐ తక్యుద్దీన్‌, పోలీ్‌సలు జె. రవికుమార్‌, ప్రదీ్‌పకుమార్‌, రవినాయక్‌, నర్సింహ, శివకుమార్‌, మీరా హుస్సేన్‌ ను భువనగిరి డీసీపీ ఆకాంశ్‌ యాదవ్‌, యాదగిరిగుట్ట ఏసీపీ రమేశ్‌కుమార్‌ అభినందించారు.

Updated Date - May 05 , 2025 | 11:54 PM