ఉధృతంగానే మూసీ
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:34 AM
జి ల్లాలో మోస్తరుతోపాటు చిరుజల్లులతో కూడి న వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సగటున 11.0మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాజపేటలో 17.6 మి.మీ, పో చంపల్లిలో 17.3మి.మీ వర్షం కురిసింది.
పలు గ్రామాలకు రాకపోకలు నిలిపివేత
చెరువులు, కుంటల్లోకి చేరుతున్న నీరు
యాదాద్రి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మోస్తరుతోపాటు చిరుజల్లులతో కూడి న వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సగటున 11.0మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాజపేటలో 17.6 మి.మీ, పో చంపల్లిలో 17.3మి.మీ వర్షం కురిసింది.
జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వ ర్షాలకు భువనగిరి, బీబీనగర్, వలిగొండ మం డలాల్లోని పలు గ్రామాల్లో వరితోపాటు పత్తి చేలల్లోకి నీరుచేరింది. జిల్లావ్యాప్తంగా సుమా రు 200 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వర్షాలకు తొమ్మిది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నా యి. బీబీనగర్ మండలం మగ్దుంపల్లిలో 120 మీటర్ల వరకు మిషన్‌భగీరథ పైపులైన్ కొట్టుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా 54 ఆవాసాల కు తాగునీటి సరఫరా నిలిచింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వ ర్షాలకు మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. వ లిగొండ మండలం సంగెం-బొల్లెపల్లి, బీబీనగ ర్ మండలం రుద్రవల్లి-జూలురు లోలెవల్ బ్రిడ్జీల పైనుంచి నాలుగు అడుగుల ఎత్తులో మూసీ పరవళ్లు తొక్కుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ వరద పెరిగే అవకాశం ఉన్నందున రెవెన్యూ, పోలీస్ యం త్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, వాగుల్లోకి చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు కూడా వాగుల ఉధృతిని బట్టి వెళ్లాలని సూచిస్తున్నారు.
అలుగులు పారుతున్న చెరువులు, కుంటలు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు నగరశివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి ది గువకు నీటిని విడుదల చేయడంతో మూసీ పరవళ్లు తొక్కుతోంది.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దు
(ఆంధ్రజ్యోతి, భువనగిరి కలెక్టరేట్): అధిక వర్షాలతో మూసీ నది, వాగుల్లో నీటి ప్రవాహం అధికంగా ఉందని, మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లవద్దని జిల్లా మత్స్య శాఖాధికారి రాజారాం మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వరదలు, నీటి ప్రవాహ ప్రాంతాల్లో ఉన్న మత్స్యసహకార సంఘాల సభ్యులు ప్రతి సంఘం నుంచి ఐదుగురు గజ ఈతగాళ్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వారి పేరు, ఫోన్ నంబర్ ఇతర సమాచారాన్ని మత్స్యశాఖ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు.
పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి జానయ్య మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీచి పిడుగులు పడే అవకాశం ఉందని, పాడి పశువులు, గొర్రెలు, మేకలను లోతట్టు ప్రాంతాల్లో మేతకు తీసుకెళ్లవద్దన్నారు. అదేవిధంగా విద్యుత్ స్తంబాల వద్దకు పశువులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.