మూగజీవాలకు అందని వైద్యం
ABN , Publish Date - May 01 , 2025 | 12:39 AM
(ఆంధ్రజ్యోతి-డిండి): వైద్య సిబ్బందిలేక మండలంలోని పశువైద్యశాలలు మూతపడ్డాయి. దీంతో మూగజీవాలకు వైద్యం అందడంలేదు. మండలంలోని మూడు పశువైద్యశాలలు, రెండు సబ్‌సెంటర్లు ఉన్నాయి.
(ఆంధ్రజ్యోతి-డిండి): వైద్య సిబ్బందిలేక మండలంలోని పశువైద్యశాలలు మూతపడ్డాయి. దీంతో మూగజీవాలకు వైద్యం అందడంలేదు. మండలంలోని మూడు పశువైద్యశాలలు, రెండు సబ్‌సెంటర్లు ఉన్నాయి. సిబ్బంది నియామకం లేక వైద్యశాలలు మూతపడ్డాయి. డిండి, చెర్కుపల్లి, తవక్లాపూర్ గ్రామాల్లో పశువైద్యశాలలు, టి.గౌరారం, గోనబోయినపల్లి గ్రావ ూల్లో సబ్‌సెంటర్లు ఉన్నాయి. టి.గౌరారం, గోనబోయినపల్లి గ్రామాల్లో కొంతకాలం పశువులకు వైద్యాన్ని అందించారు. పదేళ్లుగా సబ్‌సెంటర్లు సిబ్బంది లేక మూతపడడంతో సెంటర్ల పరిధిలోని గ్రామాల్లో మూగజీవాలకు వైద్యం అందడంలేదు. పశుపోషకులు డిండి మండల కేంద్రా నికి రావాల్సి వస్తుంది. డి.నెమలిపూర్, కామేపల్లి, ఎర్రారం, జాల్‌తండా, కె.గౌరారం, గోనబోయినపల్లి, ప్రతా్‌పనగర్, దేవత్‌పల్లి, కందుకూరు, బ్రాహ్మణపల్లి, ఎర్రగుంటపల్లి, వావిల్‌కోల్, శాంతిగూడెం, టి.గౌరారంతో పాటు తండాల రైతులు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిండి, తవక్లాపూర్ పశువైద్యశాలలకు పశువులను తీసుకెళ్లే పరిస్థితి. పూర్తిస్థాయిలో పశువె ౖద్య సిబ్బందిలేక అత్యవసర సమయాల్లో సరైన వైద్యం అందక మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. ఇప్పటికే మండలంలోని చెర్కుపల్లి, గోనబోయినపల్లి, టి.గౌరారం వైద్యశాలలు మూతపడ్డాయి.
సిబ్బంది కొరత ఇలా ..
డిండి పశువైద్యశాలలో అటెండర్(ఓఎస్), కాంపౌండర్(వెటర్నరీ అసిస్టెంట్) పోస్టులు ఖాళీ ఉండగా, చెర్కుపల్లి వైద్యశాలలో డాక్టర్, అటెండర్, వెటర్నరి అసిస్టెంట్, తవక్లాపూర్ వైద్యశాలలో అటెండర్, గోనబోయినపల్లిలో అటెండర్, లైవ్‌స్టాక్ అసిస్టెంట్(ఎల్‌ఎ్‌సఏ), టి. గౌరారం వైద్యశాలలో అటెండర్, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. జిల్లా కేంద్రా నికి వంద కిలోమీటర్ల దూరంలో మం డల కేంద్రం ఉండడం వల్ల విధుల్లో చేరేందుకు పశువైద్యశాఖలో పనిచేసే ఉద్యోగులు ముం దుకు రావడంలేదు. చెర్కుపల్లి గ్రామంలో ఆసుపత్రి సిబ్బందిలేని కారణంగా వైద్యశాల మూతపడింది. 2019 పశుగణన లెక్కల ప్రకారం మండలంలో 13వేల ప శువులు, 10వేల గేదెలు, 30వేల గొర్రెలు, 11వేల మేకలు, 200కుపైగా పందులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలుపుతున్నారు.