రోడ్ల వెంట మాంసం విక్రయాలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:58 AM
మండల కేంద్రంలో జాతీయ రహదారి కోదాడ-జడ్చర్ల, నల్లగొండ రోడ్డులో రోడ్ల వెంట మాంసం విక్రయాలు కొనసాగుతున్నాయి. నిబంధనలు అమలు చేయాల్సిన ఫుడ్ సేఫ్టి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు నాణ్యమైన మాంసం లభించడం లేదు.
వ్యాధుల బారిన పడిన జీవాల మాంసం అమ్మకం
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
(ఆంధ్రజ్యోతి కొండమల్లేపల్లి)
మండల కేంద్రంలో జాతీయ రహదారి కోదాడ-జడ్చర్ల, నల్లగొండ రోడ్డులో రోడ్ల వెంట మాంసం విక్రయాలు కొనసాగుతున్నాయి. నిబంధనలు అమలు చేయాల్సిన ఫుడ్ సేఫ్టి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు నాణ్యమైన మాంసం లభించడం లేదు. గతంలో పండుగ శుభకార్యాలయాల్లో మాత్రమే మాంసాహారం తినే వారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రోజు తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మాంస కొనుగోలు చేసి తింటున్నారు. దీంతో మాంసం విక్రయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మండల కేంద్రంలో మాంసం మార్కెట్లు రోడ్ల వెంట మురుగు కాల్వల పక్కన బహిరంగంగా విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో దు మ్ము, ధూళితో పాటు దుర్వాసన వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. దీనికి తోడు మాం సం తూకంలో మోసం జరుగుతున్నాయని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ఎన్ని మాంసం విక్రయశాలలు ఉన్నాయి. వాటికి అనుమతులు ఉన్నా యా లేవా నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని అధికారులు పర్యవేక్షణ కరువైంది. కొన్ని చోట్ల వ్యాధుల బారిన పడిన గొర్రెల, మేకలను వధిస్తూ మరికొందరు మాంసాన్ని రిఫ్రిజిరేటర్లలో రోజుల తరబడి నిల్వ ఉంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైన ఫుడ్ సేఫ్టి అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.
చేపల మార్కెట్ లేక
చేపల మార్కెట్ యార్డు కూడా లేకపోవడంతో వ్యాపారులు అక్కంపల్లి, దుగ్యాల, వైజాక్ కాలనీ, వివిధ చెరువుల్లో పట్టిన చేపలను కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారులపై చేపలు కోసి విక్రయిస్తున్నారు. దీంతో రోడ్ల వెంట వెళ్లే వాహనాల దుము, ధూళితో కలుషితమై అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని పలువురు ఆరోపిస్తున్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలి కావడంతో అందరికి అనుగుణంగా ఉండడం వల్ల మండల పరిధిలోని ప్రజలు మరి చుట్టు పక్కల ఉండే మం డలాల నుంచి కూడా ఇక్కడి నుంచి మా సం విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఆదివారం పశువుల సంత జరుగుతుండడంతో చుట్టు పక్కల మండలాల నుంచి కూడా ప్రజలు నిత్యావసర సరుకుల కోసం వస్తుంటా రు. దీంతో మాంసం అమ్మకం విక్రయాలు అధికంగా జరుగుతుంటాయి. మాంసం విక్రయాలు వ్యాధుల బారిన పడిన గొర్రెలు, మేకలను ఎలాంటి పరీక్షలు లేకుండా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక చౌరస్తాలో మాంసం విక్రయించే కొంత మంది వ్యాపారులు దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు ఫ్రీజ్‌లో పెట్టి అమ్ముతున్నట్లు సమాచారం. సంబంధిత అధికారులు మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించి వ్యాధి సోకిన మేకలు, గొర్రెల మాంసం విక్రుుంచే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిబంధనలు పాటించాలి
మాంసం విక్రయదారులు సంబంధిత అధికారులతో పరీక్షలు చేయించుకున్నాకే మాంసాన్ని విక్రయించాలి. వ్యాధుల బారిన పడిన మేకలు, గొర్రెల మాంసాన్ని విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ఇదే విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాంసం దుకాణ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
డాకునాయక్, గ్రామ కార్యదర్శి, కొండమల్లేపల్లి