Share News

రేపటి నుంచి మట్టపల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - May 09 , 2025 | 12:20 AM

మఠంపల్లి మే 8 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లాలోని కృష్ణానది తీరంలో మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద స్వయంభు లక్ష్మీనృసింహుని ఆలయంలో శనివారం నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి సిద్ధం చేశారు. ఈ క్షేత్రం 1200 ఏళ్ల క్రితం ఏర్పడిం ది.

రేపటి నుంచి మట్టపల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు

ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ కమిటీ

వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మఠంపల్లి మే 8 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లాలోని కృష్ణానది తీరంలో మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద స్వయంభు లక్ష్మీనృసింహుని ఆలయంలో శనివారం నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి సిద్ధం చేశారు. ఈ క్షేత్రం 1200 ఏళ్ల క్రితం ఏర్పడిం ది. ఇక్కడ ప్రశాంతంగా ప్రవహించే కృష్ణమ్మ ఉప్పొంగి రెండు పర్యాయలు స్వామివారి కంఠాన్ని తాకింది. రెండు తెలుగు రాషా్ట్రల భక్తులతో పాటు దేశంలోని అనేక రాష్ర్టాలకు చెందిన భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. తమిళనాడు రాష్ట్రం చెన్నై కు చెందిన శ్రీ మూక్కురు పీఠం వారు లక్ష్మీనరసింహ చారియర్‌ ట్రస్టు స్థాపించి మట్టపల్లి క్షేత్రం గురించి విశేష ప్రచారం చేస్తున్నారు.

విద్యుత రంగాలతో సుందరంగా..

మట్టపల్లి లక్ష్మీనరసింహుని క్షేత్రంలో ఈనెల 10 నుంచి 15 వరకు వైశాఖ శుద్ధ త్రయోదశిలో స్వామివారి కల్యాణోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రకరకాల విద్యుత రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. వేసవి దృష్ట్యా కల్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ప్రాంగంణంలో చాలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చెన్నై, తమిళనాడు, కర్ణాటక, తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నదున వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీడ, తాగునీటి, వసతి ఏర్పాట్లు చేశారు. క్షేత్రంలోని అన్ని కులాల వారు అన్నదానానికి ఏర్పాటు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హు జూర్‌నగర్‌ సీఐ చరమందరాజు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ రాష్ట్రంలోని పిడుగురాళ్ల, మాచర్ల, తెలంగాణ నుంచి కోదాడ, మిర్యాలగూడ నుంచి ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను నడపనున్నారు.

ఉత్సవాల్లో కార్యక్రమాలు...

మట్టపల్లి మహోక్షేత్రంలో ఈనెల 10న బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా విష్వక్ష్సేన పూజ, రక్షాబంధనము, అఖండ దీపారాధన, అంకురారోహణం, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠాపన, 11న సుప్రభాతం, ప్రాత:కాలార్చనలు, పంచామృత అభిషేకాలు, ద్రవిడ ప్రబంధ సేవాకాలం, మల్లికాపుష్ప సహస్ర నామార్చన, లక్ష మల్లికా పుష్ప పూజ, ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎదుర్కోలు మహోత్సవం, సాయంత్రం నాలుగు గంటలకు నాదస్వర కచేరి, ఆరు గంటలకు ముడుంబై శ్రీనివాసాచార్యులు, శ్రీమతి రాఘవలక్ష్మి మనోహర్‌ వారిచే భక్తి సంగీతం, సంకీర్తన, 9గంటలకు గుంటూరు వారిచే భక్తప్రహ్లాద హరికథ, 10గంటలకు శ్రీలక్ష్మీనృసింహ నామ సంకీర్తన, రాత్రి 11:30లకు శ్రీలక్ష్మీ నరసింహస్వామి రాజ్యలక్ష్మీ సమేత చెంచులక్ష్మీ అమ్మవార్లకు ఎదుర్కోళ్లు, 12గంటలకు స్వామివారికి తిరుకల్యాణమహోత్సవం (తలంబ్రాలు) కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు. 12న స్వామివారికి గరుడ వాహన సేవ, 13న హంస వాహన ఉత్సవం, 14న వసంత సేవ (ప్లవోత్సవం) చక్రతీర్థం, ఆస్తహోమం, పూర్ణాహుతి, 15న ద్వాదశ సేవలు, శృంగార డోలోత్సవం, పవళింపు సేవతో ఈ ఉత్సవాలు ముగిస్తాయని ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లి, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీనలు గురువారం తెలిపారు. ఈ కల్యాణ మహోత్సవ కార్యక్రమాలు బొర్రా వెంకట వాసుదేవాచార్యులు, పరాశరం వెంకటాచార్యులు, నారాయణం హరికిరణాచార్యుల ఆధ్వర్యంలో జరుగుతాయని వారు తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 12:20 AM